ప్రజలకు మోడీ బంపర్ ఆఫర్: భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర

482

మోదీ స‌ర్కారు ఎన్నిక‌ల వేళ స‌రికొత్త ఆఫ‌ర్లు ప‌థ‌కాలు దేశీయ ప్ర‌జ‌ల‌కు అందిస్తోంది.. ఈ స‌మ‌యంలో బ్యాంకు ఖాతాదారులు అంద‌రికి అతి తక్కువ ప్రిమియం చెల్లిస్తే ఇన్సూరెన్స్ అనే ప‌థ‌కం ఇటీవ‌ల ప్ర‌వేశ పెట్టింది… అలాగే మ‌రో కొత్త ఆవిష్క‌ర‌ణ కూడా చేస్తున్నారు… జ‌న‌వ‌రితో తాజాగా పెట్ర‌లో- డీజీల్ రేట్ల‌ను త‌గ్గించాలి అని కేంద్రం కూడా ఆలోచిస్తోంది… ఇక ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌ర‌కి ఎంతో అవ‌స‌రం అయిన ఎల్పీజీ వంట‌గ్యాస్ ధ‌ర‌ను కాస్త త‌గ్గించింది మ‌రి ఆ విష‌యాలు తెలుసుకుందాం.

Image result for వంట గ్యాస్

వంట గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. సబ్సిడీ ఎల్బీజీ సిలెండర్ పైన రూ.6.52 మేర తగ్గిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ (ఐఓసీ) ఈ రోజు ప్రకటించింది. ఈ ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి. 14.2కేజీల సబ్సిడీ ఎల్పీజీ సిలెండర్ ధర ఢిల్లీలో రూ.507.42గా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయి. దీంతో సిలెండర్ ధర రూ.500.90 అవుతుంది అని తెలియ‌చేసింది కంపెనీ.జూన్‌ నెల నుంచి సిలెండర్ ధర పెరుగుతోంది. ఇప్పటి వరకు ఆరుసార్లు వంట గ్యాస్ ధరను పెంచారు. ఈ ఆరు నెలల్లో రూ.14.13 మేర గ్యాస్ ధర పెరిగింది. రూపాయి విలువ బలపడటంతో పాటు, అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో ఎల్పీజీ ధరలు భారీగా తగ్గినట్లు ఐఓసీ తెలిపింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సబ్సిడీయేతర సిలెండరు ధరపై రూ.133 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు సబ్సిడీయేతర సిలెండరు ధర రూ.942.50గా ఉంది. ఇక నుంచి ఢిల్లీలో సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలెండరు ధర రూ.809.50గా ఉంటుంది. గృహ వినియోగదారులకు సబ్సిడీ కింద ఏటా 12 సిలెండర్లను ఇస్తారు. సబ్సిడీ నగదును వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. డిసెంబరు నెల నుంచి సబ్సిడీ కింద వినియోగదారులకు రూ.308.60 నగదును బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. మ‌రి చూశారుగా ఈ ధ‌ర‌ల త‌గ్గుద‌ల పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.