వాళ్లను చంపేయాలి.. మోదీకి 4వ తరగతి బాలిక లేఖ వైరల్

251

మొన్న జరిగిన పుల్వామా దాడిలో మొత్తం 49 మంది వీర మరణం చెందారు. ఈ ఘటన కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు యావత్తు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు ఇంతపని చేశారా అని వాళ్ళ మీద ధ్వజమెత్తుతున్నారు. యావత్తు ప్రపంచం భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదం నశించాలని కోరుకుంటున్నారు.ఈ ఘటన కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు యావత్తు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు ఇంతపని చేశారా అని వాళ్ళ మీద ధ్వజమెత్తుతున్నారు. యావత్తు ప్రపంచం భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదం నశించాలని కోరుకుంటున్నారు.

Image result for modi

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులు రగిలిపోతున్నారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్‌కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశం నుంచి దిగుమతులపై 200 శాతం కస్టమ్స్ డ్యూటీని విధించింది.అలాగే మోడీ కూడా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో సూరత్‌లో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలిక మరో అడుగు ముందుకేసి.. ప్రధాని మోదీకి లేఖ రాసింది. పుల్వామా ముష్కర దాడి గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాకు చెందిన ఓ బాలికను తీవ్రంగా కలచివేసింది. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఒక్కొక్కరినీ కాల్చి చంపాలని కోరింది. సూరత్ జిల్లా పూనాకు చెందిన మనాలీ అనే ఈ పాప రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ క్రింది వీడియో చూడండి 

దుర్మార్గులను చంపడం తప్పేమీ కాదని భవద్గీతలోనూ చెప్పినట్లు మనాలి గుర్తుచేసింది. ‘మోదీ గారు.. మీపై నమ్మకం ఉంది. మీరు ఏది చేసినా మంచే చేస్తారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఒక్కొక్కడిని కాల్చి చంపేయాలి. అలాంటి వాళ్లను చంపడం పాపం కాదని గీతలో కూడా చెప్పారు. మనాలి తన ఇంట్లో హోమ్‌వర్క్ చేస్తుండగా.. టీవీలో పుల్వామా దాడికి సంబంధించిన వార్త చూసి చాలా బాధపడింది. ప్రధానితో మాట్లాడొచ్చా అని వెంటనే తన తల్లిని అడిగింది. మాట్లాడటం కుదరదు కానీ, లేఖ రాయమని తల్లి సూచించారట. దీంతో ఆ బాలిక హిందీలో ఓ లేఖ రాసి ప్రధానికి పంపించింది. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఈ బాలిక మోడీకి రాసిన ఈ లేఖ గురించి అలాగే పుల్వామా ఘటనకు బదులుగా ఏం చేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.