పాకిస్ధాన్ కు మోడీ హెచ్చ‌రిక 24 గంట‌ల టైమ్ పాక్ ప్ర‌ధాని స‌మావేశం

358

పాకిస్ధాన్ ఉగ్ర‌వాదుల‌కు చోటు క‌లిపిస్తోంది అనే విమ‌ర్శ‌లు ఏనాటి నుంచో ఉన్నాయి ఉగ్ర‌మూక‌ల‌కు స్ధానం క‌ల్పించి అశాంతిని ప్ర‌బ‌లిస్తున్నారు అనేది భార‌త్ సాక్ష్యాల‌తో స‌హా చూపిస్తుంటే పాక్ మాత్రం మాకు సంబంధం లేదు అని చెబుతోంది..జాతి భద్రత ప్రమాదంలో పడినప్పుడు ప్రభుత్వాలు కఠినంగానే వ్యవహరించాలి. పాకిస్థాన్‌ స్వయంగా పాలుపోసి పెంచుతున్న జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ పుల్వామాలో ఆత్మాహుతి దాడికి తెగబడి 40మందికిపైగా భారతీయ జవాన్లను పొట్టనపెట్టుకున్న ఘటన దేశ భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది.

Image result for pulawama

. ఆ ఘటనతో యావద్దేశం ఆందోళనలో కూరుకుపోయింది. అలాంటి తరుణంలో కేంద్రప్రభుత్వం ఏ మాత్రం నిర్లిప్తంగా వ్యవహరించి ఉన్నా దేశంలో పరిస్థితి అదుపు తప్పేది. కానీ, మోదీ సర్కారు పకడ్బందీ చర్యలతో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. పాకిస్థాన్‌కు అత్యంత ప్రాధాన్య హోదా (ఎమ్‌ఎఫ్‌ఎన్‌)ను తొలగించడంతోపాటు ఆ దేశంనుంచి దిగుమతి చేసుకునే సరకులపై 200 శాతం సుంకం విధించడం, రావి, బియాస్‌, సట్లెజ్‌ నదుల అదనపు జలాలను పాకిస్థాన్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం వంటి చర్యలను జాతి జనులు హ‌ర్షించారు. పుల్వామా దుర్ఘటనపై అంతర్జాతీయ సమాజాన్ని ఒక్క తాటిపైకి తీసుకురావడంలో భారత ప్రభుత్వం దాదాపుగా విజయం సాధించింది. జైషే మహమ్మద్‌ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించడంతోపాటు, దాన్ని కట్టడి చేయడంలో పాకిస్థాన్‌ వైఫల్యాన్నీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సహా చైనా కూడా తూర్పారపట్టేలా చేయడం భారత్‌ సాధించిన గొప్ప విజయం.

భారత విదేశాంగ శాఖ అత్యంత వేగంగా స్పందించడంవల్లే ఇదంతా సాధ్యమైంది. ఏం చేయాలో, ఎలా స్పందించాలో, సాధించాల్సిన లక్ష్యమేమిటో తెలియని గందరగోళంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు గతంలో చేష్టలుడిగి స్పందించేవి. చేరుకోవాల్సిన గమ్యమేమిటన్న విషయంలో ఒకప్పటి ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత సర్కారు స్పష్టమైన దృక్పథంతో ఉందనే చెప్పాలి.పాకిస్థాన్‌ తెంపరితనం ప్రదర్శించిన సందర్భాల్లో ఆకుకు అందని పోకకు పొందని పద్ధతిలో గతంలో ప్రభుత్వాలు నిర్లిప్తంగా స్పందించేవి. ఆ పరిస్థితి ఇప్పుడు మారింది. పుల్వామా ఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించిన విధానం, అది మున్ముందు చేపట్టబోయే చర్యలు పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం నేర్పేవే. యుద్ధమొక్కటే సమస్యకు పరిష్కారం అని వాదించేవాళ్లతోపాటు, పాక్‌పై సమరానికి దిగడంవల్ల ఒరిగేదేమీ ఉండదని అభిప్రాయపడేవాళ్లనూ దారికి తెచ్చుకునేలా ఉంది ప్రస్తుత ప్రభుత్వ స్పందన. పాకిస్థాన్‌ ఘాతుకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. దెబ్బకు దెబ్బతీసి ప్రత్యర్థికి గుణపాఠం నేర్పించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. సరిహద్దుల్లో పాక్‌ ఎగదోస్తున్న ఉగ్రవాదంతో దశాబ్దాలుగా విసిగివేసారిన ప్రజలు ఇప్పుడు గట్టి చర్యలు ఆశిస్తున్నారు.

Image result for pulawama

ఓపిక నశించిన జనం సీమాంతర ఉగ్రవాదాన్ని తుదముట్టించే బలమైన స్పందనను కోరుకుంటున్నారు. రాజకీయ పార్టీలు లేక ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రోద్బలంతో జరిగిన ప్రదర్శనలు కావు ఇవి. గుండెలు మండిన ప్రజా సమూహం పిడికిళ్లు బిగించి, స్వచ్ఛందంగా రోడ్లమీదకు వచ్చి కదం తొక్కారు. ఇన్నాళ్లూ సీమాంతర ఉగ్రవాదాన్ని రాజేస్తూ ఆ మంటల్లో చలికాచుకుంటున్న పాకిస్థాన్‌ను దిమ్మతిరిగే దెబ్బకొట్టాలన్న డిమాండ్ల నేపథ్యంలో మొట్టమొదటిసారిగా భారతీయ నిఘంటువులో ‘ప్రతీకారం’ అన్న మాట వచ్చి చేరింది. ఇప్పుడు వెయ్యి కిలోల బాంబుల‌తో పాక్ లో ని ఉగ్ర‌శిబిరాల‌తో దాడి చేయ‌డంతో భార‌త్ సత్తా మ‌రోసారి పాక్ కు తెలిసింది భార‌త్ యుద్ద విమానాలు బోర్డ‌ర్ దాటి రావ‌డం పై పాక్ కామెంట్లు చేస్తున్నా శ‌త్రువులని మ‌ట్టుబెట్ట‌డంలో భార‌త్ పెద్ద హ‌స్తం వేసింది ఇక దీంతో పాక్ ప్ర‌ధాని అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటుచేసి త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు రెడీ అవుతున్నారట‌.