300 మంది టెర్రరిస్ట్ ల మృతి తర్వాత మోడీ చనిపోయిన జవానుల సమాధుల దగ్గరికి వెళ్లి ఏం చేసాడో తెలిస్తే షాక్

255

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు దాడులు చేసి ధ్వంసం చేశాయి. పాక్‌లోని బాలాకోట్‌పై భారత్‌కు చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన పలు స్థావరాలతో పాటు జైషే కమాండ్ కంట్రోల్ రూమ్ నామ రూపాల్లేకుండా నాశనమైంది. 300 మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్లు తెలుస్తోంది.దాదాపు వెయ్యి కిలోల బాంబులు జారవిడిచినట్లు సమాచారం.భారత వైమానిక బృందం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో పేలుడు పదార్థాలతో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం.

Image result for jawans

రాజస్థాన్ లోని చిరులో మాజీ సైనిక ఉద్యోగుల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.పుల్వామా దాడికి ధీటుగా ప్రతి దాడి చేసిన వాయుసేన సైనికులను పొగడ్తలతో మంచెత్తారు. మీ చర్యతో ఇక దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్పారు. తనకు దేశం కంటే మరేదీ ముఖ్యం కాదన్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్ కు కనువిప్పు కలిగేలా మెరుపుదాడి చేసిన వీరులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సభలో ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ఆ సమయంలో అక్కడున్న మాజీ సైనికులు కరతాళధ్వనులతో సభా ప్రాంగణం మారుమోగింది. అయితే ఈ సమావేశం తరువాత అమరజవాన్ల సమాధుల వద్దకు వెళ్లి మోడీ నివాళి అర్పించారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే ఆ సమాధుల వద్ద మోడీ చాలా ఉద్రేకంగా భావోద్వేగంగా కనిపించాడు.అమరుల సమాధుల మీద పూలతో నివాళి అర్పించాడు. మీ మరణం వృధా కానివ్వం. ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడు. మిమ్మల్ని మట్టిలో కలిపినా ఏ ఒక్కరిని కూడా వదలం. ఉగ్రవాదమే లేకుండా చేస్తాం. ఈరోజు చేసిన దాడి ఒక చిరస్మనీయం. ప్రతిసారి కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్థాన్ వెన్నులో వణుకుతీసుకొచ్చామన్నారు. దీంతో భారత్ పై దాడి అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దేశము కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి జవాన్ ఆత్మ ఈ దాడితో శాంతిస్తుందని అనుకుంటున్నా అని మోడీ చాలా భావోద్వేగంగా అక్కడ మాట్లాడాడు. మోడీ మాటలు విని అక్కడి లెఫ్టినెంట్ జనరల్ ఒకింత షాక్ కు గురయ్యాడంట. మోడీ మాటలు వింటుంటే ఇంకా ఏదో పెద్ద చర్యనే తీసుకునేలా ఉన్నాడని అందరు అనుకుంటున్నారు. చూడాలి మరి మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో. మరి భారత వైమానిక దళాలు చేసిన ఈ దాడి గురించి అలాగే మోడీ జవాన్ల సమాధుల వద్ద చేసిన ఈ వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.