భారత గడ్డ మీద అడుగుపెట్టిన అభినందన్‌ కు బంపర్ ఆఫర్స్ ప్రకటించిన ప్రధాని మోడీ

310

కోట్లాది మంది భారతీయ గుండెలు ఆనందంతో ఉప్పొంగుతుండగా.. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్.. భారత గడ్డపై సగర్వంగా అడుగుపెట్టారు. శుక్రవారం (మార్చి 1) రాత్రి 9.15 గంటల సమయంలో ఆయన పాక్ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పంజాబ్‌లోని వాఘా-అట్టారీ సరిహద్దు వద్ద భారతీయుల జయజయ ధ్వానాల మధ్య భారత గడ్డపై అభినందన్ కాలుమోపారు. అభినందన్‌ వెంట ఆయన సతీమణి తన్వీ ఉన్నారు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, ధీరత్వంతో అభినందన్ తన మాతృ గడ్డపై అడుగు పెట్టారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అభినందన్ రాక కోసం ఆయన తల్లిదండ్రులతో పాటు వేలాది మంది భారతీయులు గంటల తరబడి నిరీక్షించారు. అభినందన్‌ను అప్పగించే సమయాన్ని పాక్ అధికారులు రెండుసార్లు మార్పు చేశారు. ఇస్లామాబాద్ నుంచి అభినందన్‌ను వాయు మార్గం ద్వారా లాహోర్ తరలించిన పాక్ అధికారులు.. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అట్టారీ వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చారు. అక్కడ కొన్ని లాంఛనాలు, వైద్య పరీక్షల అనంతరం ఆయణ్ని భారత అధికారులకు అప్పగించారు. ఈ ప్రక్రియ కోసం 6 గంటలకు పైగా సమయం తీసుకున్నారు. దేశభక్తికి ప్రతిరూపంలా కనిపించిన అభినందన్‌ రాకతో దేశ ప్రజలు జై హింద్ నినాదాలతో హోరెత్తించారు.పాక్ చెర నుంచి అభినందన్ తిరిగి రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. వెల్‌కమ్ హోం వింగ్ కమాండర్ అభినందన్ అని ట్వీట్ చేసిన ఆయన.. నీ అసాధారణ ధైర్యసాహసాలను చూసి దేశం గర్విస్తోందన్నారు. మన భద్రతా సిబ్బంది 130 కోట్ల మందికి స్ఫూర్తి. వందేమాతరం అని మోదీ ట్వీట్ చేశారు.

Image result for abhinandan

శుక్రవారం మధ్యాహ్నం తమిళనాడులో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన మోదీ.. ఐఎఎఫ్ పైలట్‌ను చూసి దేశ యావత్తూ గర్విస్తోందన్నారు. ఈ సందర్భంగా మోడీ అభినందన్ కు కొన్ని బంపర్ ఆఫర్స్ ప్రకటించాడు. త్వరలోనే ఆయనకు ప్రమోషన్ తో పాటు తమిళనాడులో ఆయనకు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు ప్రకటించాడు.ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.అలాగే కోటి రూపాయల ప్రైజ్ మనీ ఇస్తున్నట్టు తెలిపారు. అలాగే కుటుంబం కార్డు ఒకటి ఇస్తున్నట్టు దాని ద్వారా కుటుంబం మొత్తం దేశం మొత్తంలో ఎక్కడైన హాస్పిటల్ లో ఉచితంగా చూపించుకోవచ్చని మోడీ చెప్పాడు. ఇలా దేశం గర్వించదగ్గ హీరోకు మోడీ సహాయం చేస్తున్నాడు.మరి దేశానికి తిరిగొచ్చిన అభినందన్ గురించి అలాగే అభినందన్ కు మోడీ ప్రకటించిన ఆఫర్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.