తెలంగాణ ఎలక్షన్స్ లో ఘోరం : ఎమ్మెల్యే కొడుక్కి పరిస్థితి ఘోరం చనిపోతున్నాడని తెలిసి ప్రసంగం ఆపి.. కన్నీరు కారుస్తూ స్టేజీ దిగి పరుగులు తీసిన ఎమ్మెల్యే

415

ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడుకు పరిస్థితి విషమం.. మనోవేదనలో నలిగిపోతున్న నాంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌ ఆవేదన వర్ణనాతీతం. గత శుక్రవారం రాత్రి చివరిసారి ప్రచార సభలో పాల్గొన్న ఆయన చిన్నకుమారుడు మక్సూద్‌ హుస్సేన్‌ (32)పరిస్థితి గురించి సమాచారం రాగానే ప్రసంగంలోనే కన్నీరు కారుస్తూ స్టేజీ దిగేశారు.

ఆ తర్వాత ప్రచారంలోకి వెళ్లకుండా కుమారున్ని చూస్తూ ఆస్పత్రిలోనే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం గురించి పట్టించుకోవద్దని.. అది తాము చూసుకుంటామని మజ్లిస్‌ అధినేత స్పష్టమైన ఆయనకు సంకేతాలిచ్చేశారు.
నాంపల్లి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే, మజ్లిస్‌ పార్టీ ప్రతినిధి జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌ ఈ సారి కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయనకు ఈ సారి కూడా పార్టీ టికెట్‌ దక్కింది. ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతున్న తరుణంలో కుమారుడు మక్సూద్‌ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం ఆయనను మానసికంగా కలచి వేసింది.

పదేళ్లుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ. వైద్య చికిత్సలో ఎలాంటి లోటు లేకుండా కాపాడుకుంటూ వచ్చారు. తండ్రి పూర్తిగా కుటుంబంతో గడుపుతున్నారని.. ప్రచార బాధ్యతలు పార్టీ అధినేత అసదుద్దీన్‌ తీసుకున్నారని.. ప్రస్తుతం సోదరుడు కోలుకోవడమే తమకు కావాల్సిందని జాఫర్‌ పెద్ద కుమారుడు మిన్‌హాజ్‌ వివరించారు. సోదరుడి అనారోగ్యం గురించి ఆయన వివరాలు చెబుతూ… కోలుకోవాలంటూ దేవున్ని ప్రార్థించాలని కంటతడి పెట్టారు.