శిశువు గర్భంలో ఉన్నప్పుడు చేసే 12 అద్బుతమైన పనులు

98

త‌ల్లి కాబోతున్నా… అని తెలిస్తే చాలు, అలాంటి మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో ఆనందం క‌లుగుతుంది. అయితే క‌డుపులో పెరిగే బిడ్డ ఆడో, మ‌గో తెలుసుకోవాల‌న్న కుతూహ‌లం కూడా వారికి ఉంటుంది. వారికే కాదు, ఆ మ‌హిళ‌ల భ‌ర్త‌ల‌కు, ఇంట్లో ఉన్న‌వారికి క్యూరియాసిటీగానే ఉంటుంది. అయితే గ‌ర్భ‌స్థ శిశువు లింగ నిర్దార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌డం మ‌న ద‌గ్గ‌ర నిషేధం అనేది తెలిసిందే.

Image result for small babies

తల్లి కడుపులో బిడ్డ తొమ్మిది నెలలు ఉంటుంది అని మనకు తెలుసు. అక్కడే ఆక్సిజన్, అక్కడే నిద్ర . ఇంతేనా? బిడ్డ నుంచి ఇంకా ఎలాంటి స్పందనలు, ప్రతిస్పందనలు ఉండవా? ఎందుకుండవు ఉంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తాయి, మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి.మ‌రి అలాంటి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for pregnancy

మూడు నెలలు దాటాక పసికందు కలలు కూడా కంటుంది తెలుసా? వినడానికి వింతగా అనిపించవచ్చు కాని ఇదే నిజం. తల్లి కడుపులో కలలు కనే ఎబిలిటి పిల్లలకి ఉంటుంది. కాని ఈ ప్రపంచాన్ని చూడని పిల్లలు ఏం కలలు కంటారు అనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకి అంతుచిక్కట్లేదు.. తల్లి తుమ్మినప్పుడు బిడ్డ చిన్నిపాటి ఆందోళనకు గురవుతుంది . ఇక ఇలా క‌ల‌లు క‌న‌డానికి కార‌ణాలు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ డాక్ట‌ర్ల‌కు అంతుచిక్క‌ని విష‌యం అని చెప్పాలి.ఇక తుమ్మినా ద‌గ్గినా కాసేపు ఏం జరిగిందో, తల్లి శరీరం ఎందుకు కంపించినట్టు అయ్యిందో బిడ్డకు అర్థం కాదు. ఒక‌వేళ బ‌య‌ట పెద్ద పెద్ద శబ్దాలు, ఎవరైనా గట్టిగా అరవడం, సినిమా థియేటర్లో సౌండ్స్ కావచ్చు ఇలాంటివి వ‌చ్చినా స‌రేశిశువుకి తెలుస్తుంది. ఇలాంటి శబ్దాలు విన్నప్పుడు కూడా బిడ్డ భయపడుతుంది.

Image result for pregnancy

కడుపులో బిడ్డ తల్లి ద్వారానే ఆక్సిజన్ కూడా తీసుకుంటుంది. కాబట్టి తల్లి మంచి గాలి పీల్చుకోవాలి.. మీకు ఇంకో విష‌యం తెలుసా సిగరేట్ వాసన వచ్చినా బిడ్డ ఇబ్బందిపడుతుంది. అందుకే సిగ‌రెట్ కాల్చేవారికి గ‌ర్భిణీ స్త్రీలు దూరంగా ఉండాలి అస‌లు ఆ స్మెల్ ని పీల్చ‌కూడ‌దు.. కడుపులో బిడ్డ ఆవలింత కూడా తీసుకుంటుంది తెలుసా. నిద్ర వలనో, బోర్ కొట్టడం వలనో తెలియ‌దుకాని , బిడ్డ ఆవలింత కూడా తీసుకుంటుందట.. పసిబిడ్డకి ఎక్కిళ్ళు కూడా వస్తాయి. అలా వచ్చినప్పుడు తల్లికి తెలుస్తుంది, ఇక త‌ల్లి నీరు తాగిన వెంటనే బిడ్డ‌కు ఎక్కిళ్లు కూడా త‌గ్గుతాయి ఈ స‌మ‌యంలో ప్ర‌శాంతంగా ఆమె ఉండాలి.. ఒక‌వేళ కుక్క అరిచిన శ‌బ్దం వచ్చినా వినిపిస్తుంద‌ట‌, ఇక పెద్ద శ‌బ్దాలు ఏమి వినిపించినా అడిలిపోతాడ‌ట శిశువు, అందుకే త‌ల్లి ఎక్కువ‌గా ఏ విష‌యానికి టెన్ష‌న్ ప‌డ‌కూడ‌దు అని చెబుతారు డాక్ట‌ర్లు.

Image result for small babies

ఇక త‌ల్లి గ‌ర్భంలో ఉన్న స‌మ‌యంలో శిశువులు బొట‌న‌వేలుని నోటిలో పెట్టుకుంటారు. అయితే పెద్ద అయ్యాక చాలా మంది పెట్టుకుంటారు అని అనుకుంటాం. ఈ బిడ్డలు చాలా మంది బ‌య‌ట‌కు రాకుండానే ఇలా బొట‌న వేలు నోటిలో పెట్టుకుంటారు. మూడు నెల‌లు ముగిసేస‌రికి శిశువుల‌కి వాస‌న కూడా తెలుస్తుంది, దుర్వాస‌న వ‌చ్చేవాటికి దూరంగా ఉండాలి ఇలా వాటికి ద‌గ్గ‌ర ఉంటే క‌చ్చితంగా శిశువుకి దుర్వాస‌న తెలుస్తుంది.శిశువులు రుచిక‌ర‌మైన ఆహారాన్ని తీసుకుంటారు 15 వారాలు వ‌చ్చిన శిశువు రుచిక‌రమైన ఆహారాన్ని తీసుకుంటుంది.. తీపి ప‌దార్దాలు బాగా తీసుకుంటార‌ట అలాగే చేదు పుల్ల‌గా ఉండే ఆహార‌ప‌దార్దాలు అయితే చాలా దూరంగా ఉంటుంద‌ట శిశువు. విన్నారా అందుకే మీకు న‌చ్చే ఆహారంతో పాటు పిల్ల‌ల‌కు న‌చ్చే ఆహారం కూడా తీసుకోండి.

ఈ క్రింది వీడియో ని చూడండి

గ‌ర్భం దాల్చిన 23 వారాల‌కు క‌ళ్లు తెరుస్తూ మూస్తు ఉంటాడు శిశువు, ఆ స‌మ‌యంలోనే బిడ్డ మొట్ట‌మొద‌టి సారి గ‌ర్భంలో కళ్లు తెరుస్తాడు. ఇక పొట్ట‌మీద బ‌రువు లైట్ వెలుగు పడితే ప‌క్క‌కు జ‌రుగుతాడ‌ట‌, ఇక గ‌ర్భంలో కూడా పాస్ పోస్తాడు అనే విష‌యం మీకు తెలుసా. అవును మొద‌టి మూడు నెల‌లు పూర్తి అయ్యేస‌రికి శిశువులో పాస్ త‌యారు అవ‌డం స్టార్ట్ అవుతుంది.చిరున‌వ్వు న‌వ్వుతాడు శిశువు, అవును పిల్ల‌ల చిరున‌వ్వు చాలా బాగుంటుంది. అందుకే క‌డుపులోనే ప్రాక్టీస్ చేస్తాడు శిశువు,ఇక గ‌ర్బం చివ‌రి రోజుల్లో చివ‌రి 9 నెల‌లో శిశువు మీ మాట‌లు వింటూ ఉంటారు. ఏ విష‌య‌మైనా అత్యంత‌ శ్ర‌ద్ద‌తో వింటారు. శిశువు భూమి మీద‌కు రాక‌ముందే ఏడ‌వ‌డం జ‌రుగుతుంది. ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే కూడా ఏడుపు వ‌స్తుంది ..శిశువుకి జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత ఆ త‌ల్లి సంతోషంగా క‌నిపిస్తే, ఆ శిశువు ఏడుపుతో బ‌య‌ట‌కు వ‌స్తాడు.. చూశారుగా ఇలా చిన్నారులు పుట్టుక‌లో ఎన్నో విశేషాలు ఉంటాయి. మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలియ‌చేయండి అలాగే మ‌రిన్ని మీరు ఏమైనా గ‌మనించిన‌వి ఉంటే కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.