కొరివి పెట్టిన తరువాత పాడె మీద నుంచి లేచిన శవం..

552

ఎవరికైనా చావు ఒకసారి వస్తుంది.పుట్టిన ప్రతి జీవి చస్తుంది.అయితే ఒక్కసారి చస్తే ఇక వాళ్లకు ఎలాంటి జీవితం ఉండదు.అయితే చనిపోయిన వ్యక్తి మళ్ళి బ్రతకడం సాధ్యమంటారా..! కానీ ఇటీవల చనిపోయిన వ్యక్తి నిద్రలేచి అరటిపండు తిన్నాడు..పాడె మీద నుంచి నిద్రలేచాడంటూ వచ్చిన వార్తలను చాలానే విన్నాం..టీవీ చానెళ్లలో చూస్తుంటాము కూడా. ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన పై రెండింటి కంటే మరీ విచిత్ర ఘటన. ఒక చనిపోయిన వ్యక్తి పాడే మీద నుంచి లేచి కూర్చున్నాడు. మరి చనిపోయిన అతను ఎలా బతికాడు. పూర్తీగా ఈ వీడియోలో తెలుసుకుందాం.

Image result for dead body

ఒడిస్సా రాష్ట్రం గంజా జిల్లా లావుగా గ్రామంలో నివసించే మల్లిక్ మేకలను మేపేందుకు అడవికి వెళ్ళేవాడు. గత రెండు సంవత్సరాలుగా అతను ఇదే పని చేస్తున్నారు. అయితే గత నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో మల్లిక్ బాధపడ్డాడు. హాస్పిటల్ కు వెళ్లి చూపించుకున్నాడు. అయినా కానీ అతను కుదుటపడలేదు. అయితే రోజులాగే మేకలను అడవికి తీసుకెళ్లే సమయం వచ్చింది. ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు వద్దు అని ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా వినకుండా మేకలను అడవికి తీసుకెళ్ళాడు. జ్వరమే కదా ఏమి కాదు అనుకుని ఇంట్లో వాళ్ళు కూడా అతనికి ఎదురుచెప్పకుండా పంపించారు. ఇక రాత్రి అయ్యింది. ప్రతిరోజు సాయత్రం 6 గంటలకల్లా మల్లిక్ ఇంటికి వచ్చేసేవాడు. కానీ నిన్న రాత్రి అయినా కూడా అతను ఇంటికి రాలేదు. అతని కోసం ఎదురుచూసి ఎదురుచూసి ఏమైందో చూద్దాం అని బంధువులందరూ అడవిలోకి వెళ్ళారు.

ఈ క్రింద వీడియో చూడండి

మల్లిక్ అటవీ ప్రాంతంలో ఓ చోట పడిపోయి ఉన్నాడు. అతనిని చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అతనికి ఏమో అయ్యిందని కుటుంబ సభ్యులకు అర్థం అయ్యింది. అతనికి శ్వాస వుందో లేదో అని పరిశీలించారు. అతడు శ్వాస తీసుకోవడంలేదు. దీంతో అతడు చనిపోయాడనుకున్నారు. బంధువులందరినీ పిలిచారు. అతని భార్య పిల్లలు కన్నీటి పర్యంతం అయ్యారు. పాడె సిద్ధం చేసి కుటుంబ సభ్యులందరూ స్మశాన వాటికకు తీసుకెళ్ళారు. కట్టెలు పెట్టి మల్లిక్‌ను పడుకోబెట్టి కొరివి పెట్టారు. అగ్గి పైకి లేవగానే దానితో పాటు మల్లిక్ కూడా పైకి లేచి కూర్చున్నాడు. కిందకు దూకేశాడు. బంధువులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గ్రామస్తులైతే భయంతో పరుగులు తీశారు. తర్వాత అతను దెయ్యం కాదని బతికే ఉన్నాడని అర్థం చేసుకుని నీళ్లు పోసి అతనికి అంటుకున్న అగ్గిని ఆర్పేశారు. అతనికి ఏమైందో అర్థం కావడం లేదు. అతను చనిపోయాడని చెప్పినా కూడా అతను నమ్మలేదు. ఈ విషయం అలా అలా బయటకు వెళ్ళడంతో మల్లిక్‌ను చూసేందుకు 45 గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. అతను బతికినందుకు మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు.

ఈ క్రింద వీడియో చూడండి