లీటర్ రూ 22 మాత్రమే : మిథనాల్ పెట్రోల్ వచ్చేస్తోంది

9900

ఇది మాత్రం వాహన దారులకు పండగ చేసుకొనే టైం .. ఎందుకో తెలుసా .. పెట్రోల్ దగ్గర 80 రూపాయలు నుండి 22 రూపాయలకు మాత్రమే ఇస్తే .. ఇది సెలెబ్రేట్ చేసుకొనే టైం కదా !..కొందరికి ఐతే అసలు నిజామా కదా? అనే డౌట్ కూడా ఉంది కదా ! నమ్మి నా నమ్మకపోయినా ఇది నిజం .. ఎందుకంటే .. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.

ఈ క్రింది వీడియో చూడండి.

ఇక వాహనదారులకు మంచి రోజులు రాబోతున్నాయి అర్థమైపోతుంది. రోజురోజుకి పెరుగుతున్న ధరల్లో మార్పులు రాబోతున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. త్వరలోనే పెట్రోల్‌ తక్కువ ధరకే లభించనుంది. ఇందుకోసం గురువారం మిథనాల్‌ పాలసీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.ఈ పాలసీతో పెట్రోల్‌లో 15 శాతం బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే మిథనాల్ మిశ్రమాన్ని కలుపనున్నారు. దీంతో పెట్రోల్‌ ధరలు దిగి వస్తాయని, కాలుష్యం తగ్గుతుందని కేంద్ర రోడ్ల శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ గురువారం లోక్‌సభలో వెల్లడించారు.

Related image

లీటర్‌ పెట్రోల్‌ ధర 80 రూపాయలు తో పోలిస్తే, బొగ్గు నుంచి ఉత్పత్తికి అయ్యే మిథనాల్‌ ఖర్చు కేవలం రూ.22లుమాత్రమేనని చెప్పారు. ఇప్పటికే చైనా దీన్ని రూ.17కే ఉత్పత్తి చేస్తుందని తెలిపిన గడ్కారీ.. ఈ కొత్త విధానం ద్వారా ఖర్చులూ తగ్గడమే కాకుండా, కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. అలాగే ఇథనాల్‌ వినియోగం కూడా పెరగాల్సి ఉందన్నారు గడ్కారీ.

Related imageఈ మిథనాల్‌ను ముంబైలోని స్థానిక పరిశ్రమ నుంచే తయారుచేయవచ్చని వాటి నుంచి వచ్చే ఇంధనంతో బస్సులకు వాడుతామని చెప్పారు. పెట్రోల్ శుద్ధి పరిశ్రమలను నిర్మించేందుకు 70 వేల కోట్లు ఖర్చవుతూ ఉండగా మిథనాల్ అయితే లక్షన్నర కోట్లు అవుతున్నట్లు చెప్పారు. అయితే మిథనాల్ కంపెనీలపైనే ఎక్కువ దృష్టి సారించాలని చెప్పినట్లు కేంద్రమంత్రి చెప్పారు. దీంతో మిథనాల్ పెట్రోల్ బంక్ లకు చేరితే వాటి ధర తక్కువగా ఉంటుంది.

Image result for petrol rate down news

మిథనాల్ పెట్రోల్ వాడటం వల్ల మైలేజీతో పాటు ఇంజిన్ సౌండ్ ఎక్కువ రాదు.
వెహికిల్ నుంచి పొగరాకుండా చేయడంతో, కాలుష్య స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

దీపక్ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సహా ముంబై చుట్టుపక్కల చాలా కర్మాగారాలు మిథనాల్‌ను ఉత్పత్తి చేయగలవు.

ఇక స్వీడన్‌ ఆటో మేజర్‌ వోల్వో మిథనాల్‌తో నడిచే స్పెషల్‌ ఇంజీన్‌ను రూపొందించింది. లోకల్‌గా తయారైన ఇంధనంతో 25 బస్సులను త్వరలో నడపనున్నారు.

త్వరలోనే ఈ ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది కేంద్రం.నిజం గా ఇది మాత్రం గొప్ప ప్రయోగం.. దానితో దేశం లో కాలుష్యం తగ్గడానికి ఇది చక్కటి మార్గం .