దారుణం..కదులుతున్న రైలులో మహిళపై యువకుడు అత్యాచారం

555

రోజురోజుకు మనిషి చేసే రాక్షస పనులు చూస్తుంటే అసలు మనం ఏ సమాజంలో బతుకుతున్నాం అని అనిపిస్తుంది.ముఖ్యంగా ఆడపిల్లలను ఆట బొమ్మలుగా చేసుకుని వాళ్ళతో లైంగిక కోరికలను తీర్చుకుంటూ ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు.కొంతమంది అయితే చిన్న పిల్లల మీద కూడా దాడులు చేస్తున్నారు.ఒక్క మన దేశంలోనే రోజుకు వందల సంఖ్యలలో జరుగుతున్నాయి.దేశంలోనే అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for girls in train

మద్య ప్రదేశ్ రాష్టం జబల్‌పూర్‌ నగరంలోని మదన్‌ మహల్‌ రైల్వే స్టేషన్‌లో నిన్న రాత్రి ఓ మహిళ వింధ్యాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఖాళీగా ఉన్న సాధారణ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కింది. అయితే ఈ కోచ్ లో ఐదుగురు మహిళలు ఉన్నారు.అనంతరం ఆమె అందులోనే నిద్రించింది.అయితే మిగతా నలుగురు మహిళలు మద్యలో ఏదో స్టేషన్ లో దిగి వెళ్ళిపోయారు.కంపార్ట్ మెంట్ లో ఆ యువతీ ఒక్కతే ఉంది.ఆమెను ఒంటరిగా చుసిన ఆ వ్యక్తి ఆమె వద్ద ఉన్న బంగారం, వస్తువులు,నగదును దోచుకొన్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నాడు.ఆ మహిళా ఎంత అరచిన కూడా ఎవ్వరు రాలేదు.ఆ సమయంలోనే ఆ వ్యక్తి కామ బుద్ధి బయటకు వచ్చింది.

Image result for girls in train

ఆమెపై అత్యాచారం చెయ్యాలని చూశాడు. లైంగిక దాడికి ఆమె సహకరించకపోవడంతో ఆమెపై ఆ దుండగుడు దాడి చేశాడు. అతని తీవ్రంగా దాడి చేసి అత్యాచారం చేశాడు.ఆ సమయంలో ఆమె గట్టిగ అరవడంతో ఆమె అరుపులు విని ఆ సమయంలో రైలులో విధులు నిర్వర్తిస్తోన్న ఓ రైల్వే పోలీసు‌ ఆఫీసర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఆ తర్వాత ఆ యువతీ జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లి పోలీస్‌ ఇన్‌ఛార్జీ వై.మిశ్రకు కంప్లైంట్ ఇచ్చింది.బాధితురాలు ప్లాస్టిక్‌, ఇనుప సామాన్లు సేకరించి అమ్ముకుని జీవిస్తుందని పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి పేరు ఉమేశ్‌ వాల్మీకి అని, అతడు కూలీగా పని చేస్తున్నాడని చెప్పారు.

నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.చూసారుగా ఈ నీచుడు ఎంత దారుణానికి పాల్పడ్డాడో…మరి వీడికి ఏం శిక్ష వెయ్యాలి.సమాజంలో జరుగుతున్న దారుణాలకు బలి అవుతున్న ఆడపిల్లలను ఎలా కాపాడుకోవాలి.ఏం చేస్తే ఈ సమాజం మారుతుంది.ఏం చేస్తే ఆడపిల్లకు అన్యాయం జరగకుండా ఉంటుంది.ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో అలాగే రోజురోజుకు పెరిగిపోతున్నఈ అత్యాచార ఘటనల మీద మీ అభిప్రాయలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.