మగవాళ్ళు ఈ 3 తప్పులు చేయకూడదు

657

ఈ కాలంలో మావారికి ఆడవారికి పోటీ విపరీతంగా పెరిగిపోతుంది.చదువు ఉద్యోగం విషయంలోనే కాకుండా అందం విషయంలో కూడా చాలా పోటీ ఉంటుంది.అందంగా ఉండాలని ఆకర్షణీయంగా కనిపించాలని ఎవరు కోరుకోరు. ఇలా కోరుకునే వారిలో మగవారు కూడా ఉంటారు. అయితే ఇలా కోరుకునే మగవారు చేసే చిన్న చిన్న తప్పులు వారిని మరింత ముదురుగా మారుస్తుంది. ముఖ్యంగా వాళ్ళు చేసే ఒక మూడు పనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ మూడు పొరబాట్లు ఏమిటో తెలుసుకుందామా.

Image result for BOYS USING CREAMS

1. చర్మం సాఫ్ట్ గా ఉండాలని ఆయిల్ స్కిన్ ఉండకూడదని మగవారు వివిధ రకాల క్రీమ్స్ లను సోప్స్ లను వాడతారు. చాలా మంది మగవారు బాడీకి మరియు పేస్ కు ఒకే రకమైన సబ్బును వాడతారు.కానీ అలా చెయ్యడం వలన మొహం మరింత మొద్దుబారిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొహానికి కెమికల్ కలవని న్యాచురల్ ఉత్పత్తులను వాడాలని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో మనకు బాడీకి పేస్ కు సెపరేట్ క్రీమ్స్ సబ్బులు దొరుకుతాయి. వాటిని వాడటం ఉత్తమమైన పని.

Image result for BOYS USING CREAMS

2. షేవింగ్ క్రీమ్స్…. సాధారణంగా షేవింగ్ చేసుకునే వాళ్ళు వాడే క్రీమ్స్ లలో జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఎక్కువ నురుగు వస్తే అంత మంచి క్రీమ్ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇలాంటి షేవింగ్ క్రీమ్స్ వాడకం తగ్గించుకుంటే మంచిది. లోషన్ తో తయారైన నురుగు తక్కువగా వచ్చే షేవింగ్ క్రీమ్స్ వాడకం వలన గడ్డం మృదువుగా ఉంటుంది.కాబట్టి మీరు వాడే షేవింగ్ క్రీమ్స్ గురించి ఒకసారి తెలుసుకుని వాడండి.

3. సూర్యరశ్మి…… ఈ కాలంలో మగవారు పని ఒత్తిడి వలన లేదా స్మార్ట్ ఫోన్స్ వలన అర్ధరాత్రి వరకు టైం పాస్ చేసి ఆలస్యంగా నిద్రిస్తారు. దీంతో ఉదయం పూట లేటుగా నిద్రలేస్తారు. ఉదయం పూట వచ్చే సూర్యకాంతి శరీరానికి మేలు చేస్తుందని ఆ సమయంలో కొంత సమయం అయినా ఎండలో నిలబడాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కాబట్టి రాత్రి తొందరగా పడుకుని ఉదయం తొందరగా లేచి ఆ సూర్యరశ్మి వలన కలిగే లాభాలను పొందండి. చాలా మంది మగవారు ఈ సూర్యరశ్మిని మిస్ అవుతున్నారు. ఇకపై అలా చెయ్యకండి.

ఇవేనండి మగవారు చాలావరకు చేస్తున్న తప్పులు. ఇప్పుడు తెలుసుకున్నారుగా ఇక మీద చెయ్యకండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.పైన చెప్పిన మగవారు చేసే తప్పుల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.