రైలు ప్రమాదంలో బయటకు వచ్చిన పేగులను చేతిలో పట్టుకుని 11 కిమీ పరుగెత్తి ప్రాణాలను ఎలా కాపాడుకున్నాడో తెలిస్తే గ్రేట్ అంటారు

215

మన శరీరంలో ఉన్న అవయవాలను మనం చూడలేము. ఒకవేళ అవి మనకు కనపడితే వాటిని చూడగానే మనం కళ్ళు తిరిగి కింద పడిపోతాం. అయితే ఇప్పుడు మీకు ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఒక ప్రమాదంలో అతని శరీరంలో ఉండాల్సిన పేగులు బయటకు వచ్చాయి. అయినా కానీ ప్రాణం పోలేదు. కానీ ఎక్కువసేపు ఉంటె ప్రాణాలు పోతాయని ఆ పేగులను చేతిలో పట్టుకుని 11 కిలోమీటర్లు నడిచివెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాడు ఆ వ్యక్తి. మరి ఆ వ్యక్తి సాహసగాథ గురించి పూర్తీగా తెలుసుకుందామా..

Image result for mens fell down to trains

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఉప్పల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ సంఘటన వివరాలను కాజీపేట రైల్వే పోలీసులు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హుసేనాబాద్‌కు చెందిన సునీల్‌ చౌహాన్‌ (38), తన సోదరుడు ప్రవీణ్‌ చౌహాన్‌తో కలిసి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు జిల్లాకు కూలీ పనుల కోసం వెళ్తున్నాడు. వరంగల్‌ స్టేషన్‌కు కాస్త ముందు వచ్చే ఉప్పల్‌ స్టేషన్‌ దాటాక టాయిలెట్ వద్దకు వచ్చిన సునీల్‌ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. కడుపుపై పెద్ద గాయం అవ్వడంతో అతని చిన్నపేగులు బయటికి వచ్చాయి. ఇతనిని ఎవరు కూడా గమనించలేదు. అర్ధరాత్రి… చుట్టూ చీకటి. సాయం చేయడానికి కూడా ఎవరు చుట్టుపక్కల లేరు. అయితే ప్రాణం మీద అతనికి ఉన్న ఆశతో దైర్యం తెచ్చుకున్నాడు.. బయటకు వచ్చిన పేగులను పొట్టలోకి నెట్టి, చొక్కా విప్పి గట్టిగా కట్టుకుని రైలు పట్టాల వెంబడి పరుగెత్తాడు. ఒకవైపు నీరసం, కళ్ళు మూతపడుతున్నాయి. అయినా కానీ భయపడలేదు. ఎలాగైనా ప్రాణాలను కాపాడుకోవాలని అనుకున్నాడు.

అందరికి షేర్ చేయిండి

రాత్రి 2 గంటలకు కిందపడిన అతను అలాగే పరుగెత్తి హసన్‌పర్తి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అలా రక్తంతో, చేతిలో పేగులతో వచ్చిన సునీల్‌ను చూసిన వెంటనే స్టేషన్‌మాస్టర్‌ సంజయ్‌కుమార్‌ పటేల్‌ వెంటనే 108కి ఫోన్‌చేసి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కడుపులో బలమైన గాయమైందని శస్త్రచికిత్స చేశామని ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఫోన్‌ ఎక్కడో పడిపోవడంతో ఎవరికీ సమాచారం అందించలేకపోయానని, తన సోదరుడికి కూడా ఈ విషయం తెలియదని బాధితుడు చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది సాయంతో సోదరుడికి సమాచారం అందించానని వివరించారు. అయితే ఇతని పరిస్థితి చూసి హాస్పిటల్ డాక్టర్స్, నర్స్ లు కూడా షాక్ అయ్యారు. అసలు ఇది ఒక మిరాకిల్ అని డాక్టర్స్ చెప్తున్నారు. చూశారుగా బాడీలో ఉండాల్సిన పేగులు శరీరం బయటకు వచ్చినా కూడా అతను తన ధైర్యాన్ని కోల్పోకుండా ఎలా ప్రాణాలను దక్కించుకున్నాడో..