ఛీ.. రైల్వేస్టేషన్లో అందరి ముందు ఆ పని చేశాడు.. ఆమేమో ఫేస్ బుక్ లైవ్ పెట్టింది..!

398

ఈ మధ్య కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాము ఎక్కడున్నామో.. చుట్టూ ఎవురన్నారో కూడా మర్చిపోతున్నారు.  జంతువుల వలే ప్రవర్తిస్తున్నారు. ఇలా ఒళ్లు మరిచిన..  జుగుప్సా కరమైన ఘటన ఒకటి పశ్చిమబెంగాల్ లోని బందెల్ రైల్వే స్టేషన్ లో జరిగింది. ఇది చూసి తట్టుకోలేని ఓ మహిళ దానిని ఫేస్ బుక్ లైవ్ పెట్టింది.

నిన్న ఆదివారం రైల్వే స్టేషన్ లో ఓ ట్రైన్ ఆగి ఉంది. ట్రైన్ లోని మహిళా కంపార్ట్ మెంట్ లో మహిళలందరూ కూర్చుని ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి అటుగా వచ్చాడు. ఎదురుగా మహిళలున్నారన్న సంగతి కూడా మర్చిపోయాడు. ఫ్యాంట్ విప్పి.. ఆ పని చేయడం మొదలు పెట్టాడు. దీంతో అక్కడున్న మహిళలందరూ ఆ జగుప్సాకరమైన సన్నివేశాన్ని చూసి.. వాంతి చేసుకున్నంత పనిచేశారు. వీళ్లల్లోని ఓ మహిళ అతడు చేస్తున్న పనిని.. ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది. అనంతరం మిగిలిన వారితో చెప్పి…వాడిని అక్కడి నుంచి తరిమేసేందుకు ట్రైన్ దిగుతుండగా… దీనిని గమనించిన రైల్వే పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఇదంతా రైల్వే పోలీస్ ఆఫీస్ ముందే జరగడం విశేషం.

పోలీసులు మాత్రం సదరు వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని.. పేర్కొన్నారు. సాక్ష్యం కోసమే ఫేస్ బుక్ లో లైవ్ పెట్టినట్లు వీడియో తీసిన మహిళ పేర్కొన్నారు. తాను వీడియో తీయడాన్ని చూసే పోలీసులకు అక్కడకి వచ్చారని వివరణ ఇచ్చుకున్నారు. కోల్ కతాలో ఇలాంటి జుగుప్సాకరైన చర్య జరగడం ఇది రెండో సారి. గతంలో ఓ బస్సులో ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడంతో.. ప్రయాణికులు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.