పుట్టినరోజు నాడు కేరళ ప్రజల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న మెగాస్టార్..ఏం నిర్ణయమో తెలిస్తే శభాష్ మెగాస్టార్ అంటారు..

372

ఈ రోజు తెలుగు సినీ అభిమానుకు మెగా డే…. టాలీవుడ్ మెగాస్టార్, కోట్లాది అభిమానుల గుండెల్లో చిరంజీవిగా చెరగని స్థానం సంపాదించుకున్న కొణిదెల శివశంకర వరప్రసాద్ 63వ పుట్టినరోజు నేడు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఎందరో సినీ మహానుభావుల్లో మెగాస్టార్‌ది ప్రత్యేక స్థానం. 35 ఏళ్ల సినీ ప్రస్థానం, 150 సినిమాలు ఈ మెగా జర్నీలో చిరంజీవి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు.అన్నిటికి మించి కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు.అన్ని కోట్ల మంది అభిమానం దక్కించుకోడానికి ఆయన మంచి మనసు కూడా ఒక కారణం.ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన మంచి మనసును మరొకసారి చాటుకున్నాడు.మరి ఏం చేశాడో తెలుసుకుందామా.

ప్రస్తుతం కేరళ రాష్టం ఎంత దీన స్థితిలో ఉందో మన అందరికి తెలిసినదే.వరదలతో జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.వాళ్ళకు సాయం చెయ్యడానికి దేశం మొత్తం నడుం బిగించింది.ప్రతి ఒక్కరు తమకు చేతనైన సాయం చేస్తున్నారు.సినిమా తారలు అయితే లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు.మన మెగాస్టార్ కూడా తనవంతు సాయం చేశాడు.అయిన ఎక్కడో ఆయనలో ఒక వెలితి.మనం పంపిన డబ్బు వారికి ఏ మూలాన సరిపోదు అని బాధపడుతున్నాడు.అందుకే ఒక నిర్ణయం తీసుకున్నారు.ఈరోజు ఆయన పుట్టినరోజు.అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తారు.చాలా డబ్బు పుట్టినరోజు వేడుకల కోసం ఖర్చు చేస్తారు.కాబట్టి అభిమానులందరికీ చిరంజీవి ఒక చిన్న విన్నపం కోరాడు.ఈరోజు నా పుట్టినరోజు కోసం ఖర్చు చేసే డబ్బును కేరళ ప్రజల కోసం అందించండి అని కోరారు.మీరు ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయిని కేరళ cm రీలీఫ్ ఫండ్ కు పంపించండి అని కోరాడు.అంతేకాకుండా అభిమానులందరూ కలిసి జనాలలో తిరిగి డొనేషన్స్ తీసుకుని కేరళ ప్రజలకు పంపించండి అని కోరాడు.

నాకు చేతనైన సాయం నేను చేశా..మీకు చేతనైనంత మీరు ఇవ్వండి.మీకు ఏమి కాదు మేమున్నాం అనే దైర్యాన్ని కేరళ ప్రజలకు అందించండి అని చిరంజీవి కోరాడు.మనం ఎంత సహాయం చేసిన వారికి తక్కువే.కాబట్టి ప్రతి సంఘం నాయకుడిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వీలైనంత ఎక్కువ డబ్బును జమ చేసి cm రీలీఫ్ ఫండ్ కు పంపించండి అని చిరంజీవి కోరాడు.కాబట్టి చిరంజీవి అభిమానులందరూ కలిసి చిరంజీవి కోరినట్టు కేరళ ప్రజల కోసం డబ్బును డొనేట్ చేద్దాం.