తిరుపతి మెడికల్ కాలేజీలో దారుణం: ప్రేమ పేరుతో విద్యార్థినికి వేధింపులు ఆత్మహత్య

449
తిరుపతిలో మరో వైద్య విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కళాశాల వైద్య విద్యార్థిని గీతిక(19) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వైద్య అధ్యాపకులు వేధిస్తున్నారంటూ సరిగ్గా నాలుగు రోజుల క్రితం పీజీ వైద్య విద్యార్థిని శిల్ప ఆత్మహత్య చేసుకోవడంతో కలత చెందిన వైద్య విద్యార్థులు ఆందోళన బాట పట్టడం, ప్రొఫెసర్ల సస్పెన్షన్‌, బదిలీల రభస జరుగుతుండగానే మరో వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడం తిరుపతిలో సంచలనంగా మారింది.
Image result for love
కడపకు చెందిన గీతిక తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలలో రెండో సంవత్సరం పూర్తి చేసుకుని ఐదో సెమిస్టర్‌కు సిద్ధమవుతోంది. ఈమె తండ్రి విజయభాస్కరరెడ్డి అడ్వొకేట్‌గా పని చేసేవారు. ఐదేళ్ల క్రితం ఆయన మరణించారు. గీతికకు మెడిసిన్‌ సీటు వచ్చాక తల్లి హరితా దేవితో కలిసి కడప నుంచి తిరుపతికి వచ్చేశారు. శివజ్యోతినగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటూ కళాశాలకు వెళ్లివచ్చేది. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తల్లితో పాటు భోజనం చేసిన గీతిక కాసేపు చదువుకుంటానమ్మా  అంటూ గదిలోకి వెళ్లింది. అయితే సాయంత్రం 5.30 గంటలు అవుతున్నా బయటకు రాకపోవడంతో, అనుమానం వచ్చిన తల్లి గదిలోకి వెళ్లి చూసింది. అప్పటికే చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని నిర్జీవంగా కనిపించిన బిడ్డను చూసి తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్థానికుల సాయంతో రుయా ఆసుపత్రికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది.
Image result for loveఅప్పటికే గీతిక చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. గీతిక ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమేనని దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. గీతిక సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లలోంచి కొన్ని ఫొటోలను పోలీసులు సేకరించినట్టు తెలిసింది. తమకు కుటుంబ కలహాలు, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని గీతిక తల్లి చెబుతోందని పోలీసులు అంటున్నారు. తమకు ఎవరి సహకారం వద్దని ఆమె చెబుతోందంటున్నారు. అయితే గీతిక ఆత్మహత్యపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని డీఎస్పీ మునిరామయ్య తెలిపారు. రాత్రి 9గంటల ప్రాంతంలో గీతిక తల్లి రుయాస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కడప జిల్లా నుంచి బంధువులు వచ్చిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆమె తెలిపారు. గీతిక ఆత్మహత్యకు ముందు తల్లితో తన సమస్యను చెప్పిందా, లేక ఎవరికీ చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడిందా అన్న అనుమానాలను ఆమె సహ విద్యార్థినులు వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయమై ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆత్మహత్యలు సమస్యలకు ఎప్పుడూ పరిష్కారం కాదని, ఏదైనా బతికి సాధించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి

గీతిక ఆత్మహత్య సంగతి తెలుసుకున్న కలెక్టర్‌ ప్రద్యుమ్న రాత్రి 9.30 గంటలకు ఆర్డీవో నరసింహులు, జేసీ2 చంద్రమౌళితో కలిసి రుయా మార్చురీ వద్దకు చేరుకున్నారు. వైద్యులు, పోలీసులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత కారణాలతో గీతిక ఆత్మహత్య చేసుకుని ఉండ వచ్చని తెలిపారు. గీతిక మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృత దేహాన్ని అప్పగించనున్నారు.