భారీగా పడిపోయిన బంగారం ధ‌ర‌లు క్యూ క‌డుతున్న జ‌నం

262

పెళ్లిళ్ల సీజ‌న్, దీంతో గ‌త నాలుగు నెల‌లుగా అనుకున్న‌ట్లే బంగారం ధ‌ర‌లకు రెక్క‌లు వ‌స్తాయి.. గ్రాముకి భారీగా ధ‌ర పెరిగే అవ‌కాశం ఉంది అని అనుకున్నారు అంద‌రూ.. అయితే అందుకు రివ‌ర్స్ గా బులియ‌న్ మార్కెట్ ఉంది.. తాజాగా పసిడి ధ‌ర మార్కెట్లో పడుతూనే ఉంది. బంగారం ధర బుధవారం కూడా క్షీణించింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.20 తగ్గుదలతో రూ.33,430కు క్షీణించింది. గత వారం రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.1,220 పతనం కావడం గమనార్హం. దేశీయ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు . బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.39,500 వద్ద ఉంది. వెండి ధ‌ర‌లు మాత్రం మార్కెట్లో దూసుకుపోతున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 1,286.95 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 15.12 డాలర్లకు చేరింది. ఇక దేశంలో ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.20 తగ్గుదలతో రూ.33,430కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గుదలతో రూ.33,260కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ..కేజీ వెండి రూ.39,500 వద్ద స్థిరంగా ఉంటే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.594 పెరుగుదలతో రూ.38,709కు చేరింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అలాగే హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,340కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,800కు పెరిగింది. ఇక కేజీ వెండి ధర రూ.41,400 వద్ద స్ధిరంగా కొనసాగుతోంది. మొత్తానికి మార్కెట్లో బంగారం ధ‌ర‌లు నిల‌క‌డ‌గా ఉండ‌టంతో కొనుగోలు దారులు హ్యాపీగా ఉన్నారు.