పోలీసుల విచారణలో మారుతి రావు చెప్పిన షాకింగ్ నిజాలు

456

మిర్యాలగూడాలో జరిగిన పరువుహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రణయ్‌ను దారుణంగా చంపించాడు అమృతవర్షిణి నాన్న మారుతీరావు. అయితే ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.వీరిని మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.అయితే పోలీసుల విచారణలో మారుతీరావు ఎలా ప్లాన్ చేశాడో ఎప్పటినుంచి చంపాలనుకుంటున్నాడో చెప్పాడు.మరి పోలీసుల విచారణలో మారుతీరావు చెప్పిన విషయాల గురించి తెలుసుకుందామా.

Image result for pranay and amrutha

తన కూతురు అమృత వర్షిణిని కులాంతర వివాహం చేసుకున్నదని పగ పెంచుకున్నాను.కేవలం ఆ అబ్బాయి మీదనే నా పగ.నా కూతురి మీద ఎలాంటి కోపం లేదని చెప్పాడు. వివాహం తరువాత తన కూతురిని అప్పగించాలని ప్రణయ్‌ కుటుంబ సభ్యులపై అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చాను కానీ వాళ్ళు వినలేదు.ముఖ్యంగా నా కూతురు వినలేదని చెప్పాడు.అందుకే ప్రణయ్‌ని అడ్డుతొలగించి అమృతను ఇంటికి తెచ్చుకోవాలని పధకం వేసుకున్నానని చెప్పాడు.. మిర్యాలగూడకు చెందిన తన స్నేహితుడు అబ్దుల్‌ కరీంతో ప్రణయ్‌ హత్య గురించి చర్చించా. గతంలో ఓ భూ వివాదంలో తనకు పరిచయమైన మాజీ ఉగ్రవాది అబ్దుల్‌ బారీని జూలైలో సంప్రదించి హత్య చేయాలని కోరాను.ఇదే విషయమై కరీంను హైదరాబాద్‌లో ఉంటున్న అబ్దుల్‌ బారీ వద్దకు పంపించానని చెప్పాడు.అస్గర్‌ అలీ, అబ్దుల్‌ బారీ కరీంను కలసి హత్య చేయడానికి రూ.కోటి ఒప్పందం కుదుర్చుకున్నాను.

Image result for maruti rao in miryalaguda

జూలై 2వ వారంలో రూ.15 లక్షలను కరీంకు ఇచ్చి బారీకి అందజేయాల్సిందిగా తన కారులోనే డ్రైవరు శివతో పంపించానని చెప్పాడు.ఆగస్టు 22న ఇంటి వద్దనే ప్రణయ్‌ని హత్య చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు.అమృత గర్భవతి అని తెలియడం, ప్రణయ్‌ కుటుంబం రిసెప్షన్‌ ఏర్పాటు చేయడంతో పరువు పోయిందని భావించి ప్రణయ్‌ని త్వరగా కడతేర్చాలని కరీం వాళ్ళ మీద ఒత్తిడి పెంచానని చెప్పాడు.ఈ క్రమంలో ప్రణయ్‌ ఇంటికి వెళ్లి కారు కిరాయికి కావాలని అతని తండ్రి బాలస్వామిని సుభాష్‌ అడిగాడు. ఆ రోజే హత్య చేయాలని అనుకున్నా వీలు కాలేదు. దీంతో అమృతను, ప్రణయ్‌ని కిడ్నాప్‌ చేయాలని, అతన్ని హత్య చేసి అమ్మాయిని తనకు అప్పగించాలని రెక్కీ నిర్వహించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయినా అదీ సాధ్యం కాలేదు.అమృత గర్భవతి కావడంతో ఆ విషయాన్ని నా భార్యకు చెప్పింది. జ్యోతి ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం వెళుతున్నట్లు తెలియజేసింది. ఆ విషయాన్ని నా భార్య ద్వారా తెలుసుకుని బారీకి చెప్పాను. ప్రతి వారం వారు ఆస్పత్రికి వస్తున్నట్లు గుర్తించి అక్కడే హత్య చేయాలని నిర్ణయానికి వచ్చామని చెప్పాడు.అనుకున్నట్టే అక్కడే చంపేశామని పోలీసుల దగ్గర అమృత నాన్న మారుతీరావు చెప్పాడు.విన్నారుగా పోలీసుల విచారణలో మారుతీరావు చెప్పిన విషయాలు.మరీ ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ హత్య గురించి దీనికి మారుతీరావు పన్నిన కుట్ర గురించి పోలీసుల విచారణలో అతను చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.