నా భర్తను చంపారు ఉగ్రవాదుల తలలు నరుకుతా అంటూ వీర జవాను భార్య ఎంత ఆవేశంగా ఉందొ చూడండి

249

దేశం మొత్తం గర్వించే పని తన భర్త చేసి వీరమరణం పొందాడని, తాను సైన్యంలో చేరి ఉగ్రవాదుల తలలు నరుకుతానని వీర జవాను గురు (కర్ణాటకలోని మండ్య) కళావతి అన్నారు. తాను 10 సంవత్సరాలు జవానుగా పని చేసి దేశం కోసం పోరాటం చేస్తానని తన భర్త గురు అంటుండేవారని , కాని ఆయన అశయాలు నేరవేరలేదని, ఆ పని తాను పూర్తి చేస్తానని ఆయన భార్య కళావతి కన్నీటితో అంటున్నది. జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో బలి అయిన సైనికుల్లో గురు ఒక్కరు. గురు అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత ఆయన భార్య కళావతి కుంగిపోయింది. పోలీసు దుస్తులు అంటే తన భర్త గురుకు చాల ఇష్టం అని, అదే పోలీసు దుస్తుల్లో దేశం కోసం ప్రాణాలు ఇచ్చారని కళావతి కన్నీటితో చెప్పింది.

గర్వంగా ఉంది

దేశం కోసం తన భర్త గురు ప్రాణాలు వదిలారని తనకు గర్వంగా ఉందని, తాను సైన్యంలో చేరి ఉగ్రవాదుల అంతు చూడటానికి సిద్దంగా ఉన్నానని భర్త ఫోటో ముందు కళావతి కన్నీటితో చెప్పింది. దేశం కోసం పుట్టామని, దేశం కోసం పోరాటం చెయ్యాలని తన భర్త గురు చేలాసార్లు చెప్పేవారని కళావతి గుర్తు చేసింది. ఇటీవల ఉద్యోగానికి వెళ్లే సమయంలో తనకు ఏమీ కాదని గురు కుటుంబ సభ్యులకు చెప్పారని అన్నారు. ఎవరైనా జవానుల ప్రాణాలు పోయాయని టీవీల్లో చూసి వెంటనే ఆయనకు ఫోన్ చేస్తే ఇలాంటి విషయాలకు భయపడకూడదని, తనకు ఏమీ కాదని, ఏడవకూడదని గురు అంటుండేవారని కళావతి విలపించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సరిహద్దుల్లో ఏమి జరుగుతుంది అనే విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో తమకు చెప్పేవారు కాదని, మీము భయపడుతామని అన్ని రహస్యంగా ఉంచేవారని, చివరికి ఇలా జరిగిపోయిందని వీర జవాను గురు భార్య కళావతి విలపించింది. పాక్ ను సర్వనాశనం చెయ్యాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చెయ్యాలని గురు భార్య కలావతి అన్నారు. తన మొదటి సంవత్సరం పెళ్లి వేడుకలకు వస్తానని తన భర్త గురు చెప్పారని, కానీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కళావతి విలపించారు. తన భర్తను అంతం చేసిన ఉగ్రవాదుల తలలు నరకడానికి తాను సైన్యంలో చేరుతానని చెప్పిన కళావతి ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కు శాపనార్తాలు పెట్టారు.