మహిళలు తమకంటే చిన్నవారిని భర్తగా ఎందుకు కోరుకుంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

876

వివాహమనేది ప్రతి వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్యమైన ఘట్టం. వివాహ జీవితం సంతోషంగా ముందుకు సాగాలంటే భార్యాభర్తలిద్దరి మధ్య అన్యోన్యత ఉండాలి. చాలా సందర్భాలలో, వధువు వయసు సాధారణంగా వరుడి వయసుకంటే తక్కువగా ఉంటుంది. కొన్ని అరుదైన సందర్భాలలో వధువు వరుడికంటే ఎక్కువ వయసు కలిగి ఉంటుంది. ఈ విషయం గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ను పరిగణలోకి తీసుకోవాలి. వివాహాలు వైఫల్యం అవడానికి అలాగే వివాహ బంధం విజయవంతంగా ముందుకు సాగడానికి కొన్ని ఫ్యాక్టర్స్ కారణమవుతాయి. ఇప్పుడు, అసలు విషయంలోకి వస్తే, కొంతమంది మహిళలు తమకంటే తక్కువ వయసున్న పురుషులని వివాహమాడటానికి ఎందుకు ఆసక్తికనబరుస్తున్నారో ఇప్పుడు మనం చర్చించుకుందాం.

జీవితంలో వివాహం గురించి ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. ఒక్కొక్కరి అభిప్రాయం వేరుగా ఉండవచ్చు. కాబట్టి, మహిళలు వయసులో తమ కంటే చిన్నవారైన పురుషులని పెళ్లాడాలని కోరుకోవడానికి గల కారణాలను ఇప్పడు తెలుసుకుందాం.
తమ వయసులో ఉన్న మగవారు అప్పటికే సెటిల్ అయిపోయి ఉండవచ్చు… మహిళలు తమ కంటే వయసులో చిన్నవారిని పెళ్లాడడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం అవుతుంది…. వివాహమాడటానికి తమ వయసు వారిలో ఛాయిస్ లేకపోవడంతో తమ కంటే తక్కువ వయసున్న వారిపై మొగ్గు చూపుతున్నారు కొందరు మహిళలు… ఈ కారణం వలన తమకంటే తక్కువ వయసున్న పురుషులను పెళ్లాడటానికి మహిళలు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.

వివాహబంధం తమ అదుపులో ఉండటానికి మహిళలు ప్రాధాన్యతనిచ్చినప్పుడు తమకంటే చిన్నవారిని పెళ్లాడాలని వారు భావిస్తారు. వివాహబంధంపై కంట్రోల్ ని తీసుకోవడానికి వారు ఇష్టపడతారు. ప్రతి రోజుని ఆస్వాదించాలని కోరుకుంటారు. తమకంటే చిన్నవారిని పెళ్లి చేసుకోవడం వలన జీవితంపై మహిళలు తమ భర్త కంటే ఎక్కువగా అవగాహన కలిగి ఉంటారు. వీరిద్దరి మధ్య అవగాహన మరింత పెరుగుతుంది. వివాహబంధం పదిలంగా ముందుకు సాగుతుంది.తమకంటే చిన్నవారైనా పురుషుడిని వివాహమాడిన స్త్రీ తన వయసుకంటే తక్కువ వయసున్నట్టుగా భావనకు లోనవుతుంది. తనలోని యవ్వనం మళ్ళీ యాక్టివ్ గా మారినట్టు భావిస్తుంది. యవ్వనంలో పురుషులు యాక్టివ్ గా అలాగే స్పోర్టివ్ గా ఉంటారు. అదే విధమైన అనుభూతికి స్త్రీలు లోనవుతారు. తమకంటే చిన్నవారిని మహిళలు వివాహమాడటం వలన వారిలో దాగున్న చిలిపితనం బయటికి వస్తుంది. ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఇద్దరి మధ్య రొమాన్స్ కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రేమ మరింత పెరుగుతుంది. ఇద్దరూ సన్నిహితంగా ఉంటారు.

వయసుపైబడిన కొద్దీ వివాహమాడడానికి గల ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. అందువలన, వీరు తమకంటే వయసులో తక్కువున్న పురుషునితో వివాహబంధంలోకి కాన్ఫిడెంట్ గా అడుగుపెడతారు. అప్పటికే, జీవితంపట్ల అలాగే వివాహబంధం పట్ల అవగాహనతో ఉన్న స్త్రీ తన భర్తతో శృంగార జీవితాన్ని వందశాతం ఆస్వాదిస్తుంది.వీరిద్దరూ కలకాలం సంతోషంగా జీవనం సాగించేందుకు ముందుకు వెళతారు.అయితే కొంద‌రు చెప్పేదాని ప్ర‌కారం అమ్మాయి అబ్బాయి ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకుంటే వారి వ‌య‌సును ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకూడ‌ద‌ని, కాని పూర్వం పెద్ద వ‌య‌సు ఉన్న అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకోకూడ‌దు అని ష‌ర‌తులు పెట్టారు… అందుకే ఈ విధంగా ఫాలో అవుతున్నారు అని అంటున్నారు.. వివాహ బంధం పదికాలాల పాటు చల్లగా ఉండాలనే ఎవరైనా ఆశిస్తారు. ఇదే విధమైన భావన కలిగిన స్త్రీ తమకంటే తక్కువ వయసున్న పురుషుడిని వివాహమాడటానికి మొగ్గు చూపుతోంది.