పెళ్ళైన 3 నిమిషాలకే విడాకులు తీసుకుంది.. ఎందుకో తెలిస్తే షాక్..

296

విడాకులు .. దీనికి అనేక కారణాలు ఉంటాయి. పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా ఏదైనా సరే, ఒక జంట కలిసి ఉండడానికి ఎన్ని కారణాలైతే ఉంటాయో, విడిపోవడానికి కూడా అటువంటి కారణాలు అనేకం ఉంటాయి. కొన్ని కారణాలు వినడానికి కూడా సిల్లీగా కనిపిస్తుంటాయి. ఇచ్చిన బహుమతుల నుండి, పెళ్లి భోజనాల దాకా, ఆర్ధిక పరమైన అంశాల నుండి సామాజిక కట్టుబాట్ల వరకు, శారీరిక ఆరోగ్యాల నుండి మానసిక హింసల వరకు ., అనేక రకాల కారణాలు ఈ విడాకులకు ఉంటాయి. రాజకీయాలు మరియు సినిమా హీరోలు కూడా కొందరి జంటల విడాకులకు కారణం అంటే అతిశయోక్తి కాదు.అయితే ఇప్పుడు ఒక మహిళ పెళ్ళైన మూడు నిమిషాలకే విడాకులు తీసుకుంది. మరి అంత తొందరగా ఎందుకు తీసుకుందో చూద్దామా.

Image result for marriage

కువైట్ లో ఒక జంట ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది. అయితే ఏ జడ్జ్ ముందైతే నుప్తియా మీద సంతకాలు పెట్టి వివాహం చేసుకుందో, అదే జడ్జ్ ముందు వివాహం జరిగిన కొద్దిసేపటికే విడాకుల తతంగాన్ని కూడా జరిపేశారు. అసలేమైందంటే….అప్పుడే పెళ్ళైన ఈ జంట, కోర్టు బయటకు వస్తుండగా పెళ్ళికూతురు పొరపాటున కాళ్ళు తడబడి కిందపడింది. ఆ సమయంలో ఎవరైనా ఏం చేస్తారు. ఏముంది పైకి లేపుతారు కదా. కానీ కిందపడ్డ వధువును చేయిచ్చి పైకి లేపాల్సిన వరుడు, “స్టుపిడ్” నడవడం కూడా చేతకాదా అంటూ హేళన చేశాడు. అందరి ముందు అవహేళన చేసిన అతనితో తన జీవితాన్ని ఊహించుకోలేక, మరుక్షణమే వెనక్కి తిరిగి వెళ్లి జడ్జ్ ముందు చేరి పెళ్లిని రద్దు చేయమని కోరింది. అప్పటికి 3 నిమిషాలే అయింది వీరి వివాహం జరిగి. చివరికి విడాకుల పత్రం మీద సంతకం పెట్టేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నిజమే నాలుగు గోడల మద్యన చిత్ర హింసలు పెట్టినా, భాగస్వామిలో మార్పుకోసమే కొందరు ఎదురుచూస్తుంటారు. కానీ నలుగురిలో మనిషి అహం మీద దెబ్బకొడితే ఈ ప్రపంచంలో ఎవరూ చూస్తూ ఊరుకోరు. కానీ ఇక్కడ తన జీవితం ఆ వ్యక్తితో ముడిపడి ఉంది. వ్యక్తిగతంగా అనుభవించిన ఆ మహిళకే తెలుసు, తాను ఎదుర్కొన్న అవమానం ఎలాంటిదో. క్రమంగా ఆ సంఘటన విడాకులకు దారితీసింది. దీన్ని క్షణికావేశం అనడం కూడా తప్పే. కొందరు ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం కూడా అత్యంత ఆలోచనని కూడుకుని ఉంటాయని మరువకూడదు. సరైన పని చేసినందుకు ఆ మహిళకు మద్దతిచ్చిన వ్యక్తులు ఉండగా, అతని నుండి విడిపోవడానికి ఈ చిన్న విషయాన్ని కారణంగా చూపిందని అంటున్నవారు కూడా ఉన్నారు. కానీ అన్నం ఉడికిందో లేదో తెలుసుకోడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లుగా, జీవితంలో తాను ఎలా ఉండబోతున్నాడో ఈ ఒక్క సంఘటనతో ఆ వరుడు చూపిన కారణంగా, ఆ మహిళ ఈ నిర్ణయం తీసుకుందని అనేకమంది అభిప్రాయం.మరి ఈ మహిళ తీసుకున్న నిర్ణయం గురించి మీరేమంటారు. ఆమె చేసింది కరెక్టా కాదా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి