కిడారి సర్వేశ్వర్రావు హత్యలో పాల్గొన్న మావోయిస్టు మీనా పోలీస్ ఎన్ కౌంటర్ లో మృతి

299

ఈ మధ్య జరిగిన అతికిరాతకంగా దారుణం మావోల ఘటన.అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు అతికిరాతకంగా చంపారు.అయితే ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు.ఎందుకంటే మావోయిస్టులు కొంతమంది ఎమ్మెల్యే లను బెదిరిస్తూ లేఖలు కూడా విడుదల చేశారు.అందుకే వారిని ఎలాగైనా పట్టుకోవాలని అడవులలో జల్లెడ పట్టారు.చివరికి ఇప్పుడు దొరికారు.అయితే ఈ ఘటనలో ఒక మహిళా మావోయిస్టు చనిపోయారు.మరి ఈ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో పాల్గొన్న మీనాను పోలీసులు ఈ రోజు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోలు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురు కాల్పులు మన్యంలో ఉద్రిక్తతకు దారితీశాయి. విశాఖ మన్యంలోని పెదబయలు, ఒడిశా సరిహద్దు జామిగుడ పంచాయతీ ఆండ్రపల్లి కొండల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. మృతి చెందిన మావోయిస్టును మీనాగా గుర్తించారు. ఈమె మావోయిస్టు పార్టీలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నారు..సెప్టెంబర్ 23వ తేదీన అరకు నియోజకవర్గంలోని లివిటిపుట్టువద్ద అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలో మీనా కీలకంగా పాల్గొన్నట్టు సమాచారం.

మీనా మృతి చెందితే జయంతి, గీత,రాధిక, రాజశేఖర్ అనే మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.మృతి చెందిన మహిళ మావోయిస్టు మీనా…. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి భార్యగా పోలీసులు చెబుతున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిగిన సమయంలో గాజర్ల రవి అడవుల నుండి బయటకు వచ్చారు. చర్చలు ముగిసిన తర్వాత రవి తిరిగి అడవుల్లోకి వెళ్లాడు. పలు ఎన్‌కౌంటర్ల నుండి గాజర్ల రవి పలుమార్లు తప్పించుకొన్నాడని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.అయితే ఇంకా చాలా మంది దొరకాల్సి ఉంది.మరి వాళ్లెప్పుడూ దొరుకుతారో చూడాలి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.