క‌ట్నం కోసం భార్య‌ను ఈ పోలీసు ఏం చేశాడో చూస్తే ర‌క్తం మ‌రిగిపోతుంది…

444

పెళ్లికి ముందు ఎంతో ఇష్టంగా ఉన్నా పెళ్లి త‌ర్వాత, త‌న కోపాన్ని ప్ర‌కోపాన్ని భార్య‌లపై చూపించే వారిని చాలా మందిని చూశాము…. ఇష్టం లేని పెళ్లి చేసుకునే వారు, అలాగే ఇష్ట‌ప‌డి ప్రేమించి పెళ్లి చేసుకున్న‌వారు కూడా ఇటువంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది.. అయితే ఇక్క‌డ స‌మాజాన్ని ర‌క్షించి, ఇలాంటి ప‌నులు చేసే వారిని శిక్షించే ఖాకీయే, ఈ ప‌ని చేయ‌డం ఇప్పుడు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి లోన‌య్యేలా చేసింది. ఓసారి ఈ ఖాకీ స్టోరీ తెలుసుకుందాం.

Image result for wife and husband angry

ప్రేమించి పెళ్లాడిన ఓ ఎస్సై త‌న భార్య, అత్తలను చితక బాదాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగా కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య ఆరోపించడంతో విచక్షణా రహితంగా గొడ్డును బాదినట్టు బాదాడు… సముద్రాల జితేందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. కరీంనగర్‌ మొగిళ్లపాడుకు చెందిన జితేందర్‌ 2015లో పాల్వంచకు చెందిన పర్వీన్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లాడిన వారం రోజుల నుంచే భార్యను వేధించేవాడు. కొన్నాళ్లకే పర్వీన్ గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు.

Image result for wife and husband angry

గొడవలు జరుగుతుండగానే.. పర్వీన్ రెండోసారి గర్భం దాల్చింది. అబార్షన్ చేయించుకోమని జితేందర్ ఒత్తిడి తేగా.. ఆమె అంగీకరించలేదు. కొత్తగూడెంకు బదిలీ అయ్యాక.. పుట్టింటికి పంపించాడు. కాపురానికి తీసుకురావాలంటే రూ.50 లక్షలు కావాలని డిమాండ్‌ చేశాడు….పర్వీన్‌ ఫోన్‌ చేసినా జితేందర్ స్పందించే వాడు కాదు… పది నెలల క్రితం బాబు జన్మించినా బాబును చూసేందుకు రాలేదు. విడాకుల కోసం ఒత్తిడి తెచ్చాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే భర్త తనను దూరంగా ఉంచుతున్నాడని పర్వీన్ నిలదీసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గురువారం పర్వీన్, ఆమె తల్లి తహెరా మణుగూరులోని జితేందర్ వెళ్లి ఎస్సై నివాసానికి వెళ్లి నిలదీశారు. దీంతో కోపోద్రక్తుడైన జితేందర్ వారిని విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో పర్వీన్‌‌కు ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. త‌న కుమారుడ్ని చేతిలోప‌ట్టుకుని జితేంద‌ర్ ని ఆమె ప్ర‌శ్నించింది ఆమెను విచ‌క్ష‌ణార‌హితంగా కొట్ట‌డ‌మే కాకుండా ఆమె ప‌ళ్లు ఊడిపోయేలా కొట్టాడు. ఆమె చిన్నారిని చేతిలో ప‌ట్టుకుని క‌న్నీరు పెట్టుకుంది.. కోపంతో ఊగిపోతూ జితేంద‌ర్ అక్కడ నుంచి బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయాడు. ఇలాంటి పోలీసుని శిక్షించాల‌ని పోలీసుల‌కే మ‌చ్చ తీసుకువ‌చ్చాడు అని అంటున్నారు స్దానికులు. ఇక ఆమె త‌న‌కు న్యాయం చేయాలి అని కోరుతున్నారు.. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను అలాగే ఆ పోలీసుల‌కు ఎటువంటి శిక్ష విధించాలో మీరు కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.