ఫ్రెండ్ కష్టకాలంలో ఉన్నప్పుడు తానై అన్నీ చూసుకున్న మనోజ్.. నీవు రియల్ హీరో అన్న..

379

సినీ హీరో, టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోవ‌డం ఆ కుటుంబానికి తీర‌ని లోటు అనే చెప్పాలి..ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తిచేశారు. ఈ అంత్యక్రియలకు నందమూరి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు సైతం సాధ్యపడలేదు. ఈ స‌మ‌యంలో నంద‌మూరి ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితంగా ఉండేవారు అంద‌రూ వ‌చ్చారు ముఖ్యంగా టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ మాత్రం ఎన్టీఆర్ క‌ల్యాణ్ రామ్ వెంటే ఉన్నారు ఇప్పుడు అది తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. నంద‌మూరి కుటుంబానికి మంచు కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. మ‌రి ఎన్టీఆర్ కుటుంబంలో ఇలాంటి విషాదం జ‌రిగితే మంచు ఫ్యామిలీ రాకుండా ఎలా ఉంటుంది అలాగే మంచు మ‌నోజ్ ఆ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల‌కు ప‌క్క‌నే ఉంది కార్య‌క్ర‌మం అయ్యేవ‌ర‌కూ ఉన్నాడు.

అక్క‌డ అభిమానులు జ‌నం వేలాదిగా రావ‌డంతో మ‌నోజ్, బౌన్సర్‌గా మారి వారిని కట్టడి చేశారు. అంతేనా తండ్రిని కోల్పోయి దుఃఖంలో మునిగిపోయివున్న ఇద్దరు సోదరులకు ఇనుప కంచెలా ఉండి అంత్యక్రియల తతంతం సజావుగా పూర్తయ్యేలా చూశాడు…మంచు మనోజ్. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లకు మంచి మిత్రుడు… తండ్రి మరణంతో ఆయన కుమారులైన కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అలాంటి పరిస్థితుల్లో అంత్యక్రియల సందర్భంగా తారక్, కల్యాణ్‌రామ్‌లను చూసేందుకు జనం ఎగబడ్డారు. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, హీరోలు అంతా అలా చూస్తూ మిన్నకుండిపోయారు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.

దీంతో ఈ ఇద్దరు అన్నదమ్ముల కోసం మంచు మనోజ్ ఒక బౌన్సర్‌లా నిలబడ్డాడు. జనాన్ని కంట్రోల్ చేసుకుంటూ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ధైర్యంగా నిలబడ్డాడు. దీనికి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనోజ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పిక్స్ చూసిన ప్రతి ఒక్కరూ మనోజ్‌ను అభినందిస్తున్నారు. అలాగే త్రివిక్ర‌మ్ కూడా అంబులెన్స్ లో వీరి వెంటేవ‌చ్చారు ఇక కొడాలి నాని యాక్సిడెంట్ అయిన స‌మ‌యం నుంచి చివ‌ర‌కు అంతిమ‌సంస్కారాలు అయ్యేవ‌ర‌కూ తార‌క్ ప‌క్క‌నే ఉన్నారు వీరు ఇద్దరూ కూడా కుటుంబ స‌భ్యుల్లా ఉంటారు. నిజంగా స్నేహానికి విలువ అంటే ఇదే అని వీరంద‌రూ రుజువు చేశారు. ఆప‌ద‌ల్లో స్నేహితుడు ఉన్న స‌మ‌యంలో వారికి స‌పోర్ట్ గా ఉండ‌టం అక్క‌డ వారిని అంద‌రిని కంట‌త‌డిపెట్టించింది.