‘ఏ పని చేయకుండా తండ్రి సంపాదనతో ఎంజాయ్ చేస్తున్నావ్?’అన్న నెటిజెన్ కు మనోజ్ షాకింగ్ కౌంటర్

376

ఇటీవ‌ల స‌మాజంలో ఎటువంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగినా మంచు మ‌నోజ్ వెంట‌నే స్పందిస్తున్నారు.. ముఖ్యంగా హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత, ఆయ‌న తార‌క్ ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ కాల్యాణ్ రామ్ కు వెన్నంటి ఉన్నారు.. తండ్రి హ‌రి అంతిమ సంస్కార కార్య‌క్ర‌మాలు వారు ఇద్ద‌రూ పూర్తి చేసే వ‌ర‌కూ వారికి అండ‌గా ఉండి, స్న‌హ‌మంటే ఇదే అని తెలియ‌చేశారు.. ఇది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం అయింది. ఇక త‌ర్వాత ఇటీవల మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కూడా మంచు మనోజ్ స్పందించారు. ప్రణయ్ పరువు హత్య కరెక్టే అంటూ కొందరు వ్యాఖ్యానించడంపై సినీ నటుడు మంచు మనోజ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇలా వాదిస్తున్న వ్యక్తులు ఉన్న సమాజంలో తాను ఉన్నందుకు సిగ్గుగా ఉందని ఫైర్ అయ్యారు. ఇంత దారుణమైన సంఘటన గురించి నేను మాట్లాడతానని ఎప్పుడూ ఊహించలేదు. కులం అనే గోడల్ని కలం చెరపలేనప్పడు. అందరూ సమానం, అంతా సమానం, మనుషులంతా ఒక్కటే అని నేర్చించలేని ఈ విద్యా వ్యవస్థ మొత్తం సిగ్గు పడాలి…. అంటూ మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక దీనిపై లేఖ‌లు సంధించారు అలాగే ట్విట్ల‌ర్ లో ఆవేద‌న‌తో పోస్టులు పెట్టారు.. దీనిపై ఆయ‌న‌కు కౌంట‌ర్ గా కొంత మంది స‌మాధానాలు రిప్లైలుగా ఇచ్చారు… మీరు రెడ్డి అమ్మాయిని ఎందుకు చేసుకున్నారు.. వేరే వారిని చేసుకోవ‌చ్చు క‌దా అని ప్ర‌శ్నించారు.. ఇలా దానికి కూడా ఆయ‌న స‌మాధానం ఇచ్చారు…తాజాగా ఆయ‌న‌కు మ‌రో నెటిజ‌న్ ఓ ప్రశ్న సంధించాడు..ఎలాంటి పని చేయకుండా మీ నాన్న సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు సూపర్ బ్రో… లైఫ్ అంటే నీదే. యంగ్ జనరేషన్‌కు ఇన్స్‌స్పిరేషన్ నువ్వు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేసారు. దానికి కౌంటర్ గా మంచు మనోజ్ తనదైన శైలిలో ఎలా రిప్లై ఇచ్చారో చూడండి.

మా నాన్న సంపాదించిన డబ్బు వాడుకుంటే ఆయన ఎంతో సంతోషంగా ఫీలవుతారు. కానీ నేను ముందు నుండి ఆయన డబ్బు ముట్టుకోలేదు. సినిమాల విషయంలో కూడా ఆయన హెల్ప్ తీసుకోలేదు. కాలేజీ రోజుల్లో రెస్టారెంట్లలో వెయిటర్‌గా, క్లీనర్‌గా పని చేశాను. సినిమాల విషయంలో ఎప్పుడూ కొత్త డైరెక్టర్లను, కొత్త టీంను ఎంచుకుని ఎంచుకుని నాకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకుంటాను అని స్పందించారు. మొత్తానికి మంచు మ‌నోజ్ కు ఇటీవ‌ల ట్విట్ట‌ర్ లో ఇలాంటి ప్ర‌శ్న‌లు సంధించే వారు ఎక్కువ అయ్యారు అనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.. ఇక ఆయ‌న ప్ర‌తీదానికి స్పందించ‌డం వ‌ల్ల ఇటువంటి ఆరోప‌ణ‌లతో కూడిన‌ ట్వీట్లు వ‌స్తున్నాయి అని అంటున్నారు.. అయితే కొంద‌రు పెట్టిన పోస్టులు ప‌ట్టించుకోకుండా ఉంటే బెట‌ర్ అని ఆయ‌న అభిమానులు అంటున్నారు.. దీనిపై మ‌రి ఆయ‌న ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.. అస‌లే మంచు ఫ్యామిలీలో మాట‌ప‌డ‌రు మ‌రి మ‌నోజ్ కూడా అంతే అని కొంద‌రు అభిమానులు అంటున్నారు..దీనిపై మీ అభిప్రాయం చెప్పండి..