అమృత తండ్రికి మంచు మనోజ్ ఎలా వార్నింగ్ ఇచ్చాడో చూడండి

447

మిర్యాలగూడ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే.మిర్యాలగూడలో మారుతిరావు అనే వ్యక్తి తన కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్న దళిత కులానికి చెందిన ప్రణయ్‌ను హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంచు మనోజ్ తన మనసులోని ఆవేదనను బయట పెట్టారు.ఈ సందర్భంగా కులం, మతం పిచ్చోళ్లను ఏకిపారే్స్తూ భావోద్వేగమైన ట్వీట్ చేశారు.మరి ఆయన ఏమని ట్వీట్ చేశాడో చూద్దామా.

Image result for pranay and amrutha

కులం ఫీలింగ్ ఎక్కడ ఉన్నా అది చాలా దారుణం. సినిమా పరిశ్రమలో తమ కులం హీరోలను అభిమానించడమైనా, కులం ప్రాతిపదికన పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ ఇవ్వడమైనా, కులం ఆధారంగా ఏర్పడే కాలేజ్ యూనియన్స్ అయినా, మరే ఇతర కుల, మత సంఘాలైనా సమాజంలో క్రూరమైన పరిస్థితులకు కారణం అవుతున్నాయి.ప్రణయ్‌తో పాటు ఎంతో మందిని బలిగొన్న ఈ పరిణామాలకు కులాలను, మతాలను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులే. అలాంటి కులం, మతం పిచ్చోళ్లు సమాజంలో ఉండటం వల్లనే ఈ దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.మనిషి జీవితం కంటే మరేదీ ఎక్కువ కాదనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం.తన తండ్రిని స్పర్శించక ముందే ఒక బిడ్డ కన్న తండ్రిని కోల్పోవడం మనస్సును కలచి వేసే అంశం. కేవలం కులం కోసం వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేశారు.

Image result for pranay and amrutha

వారి జీవితాల కంటే మీకు కులమే ఎక్కువా? దీని వల్ల మీరు సాధించింది ఏమిటి? అని మనోజ్ ప్రశ్నించారు.మన అందరికీ ఒకే రకమైన గుండె, శరీరం ఉన్నాయి. ఒకే గాలిని పీలుస్తున్నాం, ఒకే ప్రపంచంలో జీవిస్తున్నాం. కానీ కులం పేరుతో, మతం పేరుతో వర్గాలుగా విడిపోవడం ఎందుకు? మనుషులంతా ఒకటే అనే విషయాన్ని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది?ఇలాంటి కుల పిచ్చి ఉన్న వారిని చూసి సిగ్గుపడుతున్నా. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తే కాకుండా కులాలను అమితంగా ప్రేమించే ప్రతి ఒక్కరూ దీనికి భాధ్యులే. కుల వివక్ష నశించాలి. ఈ మహమ్మారిని వెంటనే అంతం చేయాలి. మన పిల్లలకు కులం, మతం రహిత మంచి భవిష్యత్తును అందిద్దాం..ప్రణయ్ భార్య అమృత, వారి కుటుంబ పరిస్థితి చూసి నా గుండె కలచి వేసింది. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని మనోజ్ వ్యాఖ్యానించారు.మనోజ్ చెప్పిన మాటలు నిజమే కదా.సమాజం ఇంత డెవలప్ అవుతున్నా అందరు ఒకటే అని ఎప్పుడు అనుకుంటారు.కులం మతం అనేవి ఈ ప్రపంచం నుంచి ఎప్పుడు తొలిగిపోతాయి.ఆ రోజు త్వరలోనే రావాలని అందరు కలిసిమెలిసి భావితరాలకు కులం అంటే ఏమిటో మతమా అంటే ఏమిటో తెలియకుండా ఉండాలని కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.మిర్యాలగూడ పరువు హత్య గురించి అలాగే కులం పేరు చెప్పి ఇలాంటి పరువు హత్యలు చేసే వాళ్ళ మీద అలాగే మంచు మనోజ్ చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.