గుడికి వచ్చిన 20 ఏళ్ల అమ్మాయిని కలలో దేవుడు చెప్పాడంటూ ఏం చేస్తున్నాడో మీరే చూడండి

411

సభ్యసమాజం లో రోజురోజుకి అత్యచారాలు పెరిగిపోతున్నాయి..ఎక్కడపడితే అక్కడ చిన్న పెద్ద అని తేడా కూడా తెలియకుండా కామాంధుల చేతులలో ఆడవారు బలైపోతున్నారు.అయితే ఇలాంటి కామాందులలో దేవుడి తర్వాత దేవుడిలాంటి వాడైనా పూజారులు కూడా ఉండటం అందరిని షాక్ కు గురి చేస్తుంది.ఓ పూజారికి దేవుడి పై ఉన్న భక్తి , యువతీ పై మళ్లింది. వయసు చూస్తే తాత వయసు కానీ కామం తన్నుకొచ్చిందో ఏమో కానీ , దేవుడు సైతం నిన్ను నాతో అలా చేయమన్నాడు అంటూ 25 సంవత్సరాలు ఉన్న ఉవతిని లొంగ దీసుకునే ప్రయత్నం చేసాడు. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

కరీంనగర్ బైపాస్ రోడ్డులో గుడి ఉండేది కాదు. పదేళ్ల కిందటే వెంకటరెడ్డి గుడి నిర్మాణానికి కొంత నగదు సాయం చేసి, మరికొందరి సహాయంతో ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి అతనే పూజారిగా కూడా వ్యవహరిస్తున్నాడు. కరీంనగర్‌కు చెందిన ఓ 25 ఏళ్ల యువతి తరుచూ ఈ ఆలయానికి వెళుతోంది. రెండు రోజుల కిందట కూడా దైవ దర్శనానికి వచ్చింది. ఆ సమయంలో గుడిలో పెద్దగా భక్తులు ఎవ్వరూ లేకపోవడంతో అదే అదునుగా భావించిన వెంకటరెడ్డి, ఆ యువతి చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ‘నాకు దేవుడు కలలో కనబడి నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు…’ అని పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దాంతో భయపడిన సదరు మహిళ, ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. ఆమె తల్లిదండ్రులు వెళ్లి పూజారిని నిలదీశారు. తల్లిదండ్రులతో కూడా పూజారి అదే విషయం చెప్పడం విశేషం. ‘నాకు ఎప్పటినుంచో కలలో దేవుడు కనిపిస్తున్నాడు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటున్నాడు…’అంటూ చెప్పాడు. 55 ఏళ్ల వయసున్న పూజారి ఈ విధంగా మాట్లాడడంతో ఆగ్రహావేశాలకు లోనైన ఆ యువతి బంధువులను పూజారికి దేహశుద్ది చేశారు.చితకబాదిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన పూాజారిపై కరీంనగర్ ఒకటో ఠాణా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పూజారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు.చూశారుగా దేవుడిలాంటి వాడు అనుకునే పూజారి ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాల గురించి అలాగే యువతి జీవితాన్ని నాశనం చేసిన ఈ పూజారి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.