బోరుబావిలోకి తలకిందులుగా దూరి ఇతను చేసిన సాహసాన్ని చూస్తే వావ్ అనాల్సిందే..!

522

ఈ ఆమధ్య నీళ్ళ కోసం తవ్విన బోర్ బావిలు చాలా డేంజర్ అవుతున్నాయి.ఆడుకుంటూ ఆడుకుంటూ కొందరు చిన్నారులు బోరుబావి గుంతల్లో పడిపోతుంటారు. వారిని రెస్క్యూ టీమ్ లు ఎంతో కష్టపడి రక్షించాలని ఒక్కోసారి ప్రయత్నించినా ఫలితం ఉండదు. బోరుబావి చుట్టూ గుంతలు తవ్వి ఎంత శ్రమించినా కూడా ఒక్కోసారి చిన్నారుల ప్రాణాలను రక్షించలేరు. అసలు బోరు బావి గుంతలను పూడ్చకుండా ఉండడం వల్లే చిన్నారులు ప్రాణాలు కోల్పొతారు.అయితే ఇప్పుడు బోర్ బావిలో పడ్డ ఒక జీవిని రక్షించడానికి ఒక వ్యక్తి చేసిన సాహసం వైరల్ అయ్యింది.ఎంతో దైర్యం చేసి దానిని కాపాడాడు.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

కర్నాటకలో ఒక ఊరిలో ఒక బోరు బావి గుంతలో చిన్నపాటి మేకపిల్ల పడిపోయింది. దాన్ని ఎలా బయటకు తీయాలని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు.బోరుబావి గుంత చుట్టూ చేరి అందులోకి తొంగిచూస్తూ మేకపిల్ల ఎంత లోతు లోపల ఉందో పరిశీలించారు. మేక పిల్ల పెద్ద లోతుకు పోకపోవడంతో దాన్ని తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఎవ్వరికీ ఆ మేకపిల్లను ఎలా తియ్యాలో అర్థం కాలేదు. ఇక కొందరైతే దాన్ని తియ్యడం కష్టం వదిలేద్దామన్నారు.అంతలోనే ఒక హీరో వచ్చాడు. చూడడానికి పొట్టిగా ఉన్నా గట్స్ మాత్రం అదుర్స్. బోరు బావి గుంతలో మేక పిల్ల ఎంత లోతులో ఉందో పరిశీలించాడు. అరే.. భాయ్ నన్ను గట్టిగా పట్టుకోండి.. నా తల మొదట గుంతలో పెడతాను. తర్వాత నా కాళ్లను గట్టిగా పట్టుకుని నన్ను అందులో జారవిడచండి కచ్చితంగా నేను మేకపిల్లను బయటకు తీసుకొస్తాను అన్నాను.

మేకపిల్ల కోసం అంత ధైర్యం చెయ్యొద్దులే అంటే అతను వినలేదు. వెంటనే గుంతలోకి తల పెట్టాడు. తర్వాత అతన్ని చిన్నగా జారవిడిచారు. అంతే క్షణాల్లో మేకపిల్ల చెవిని పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. చుట్టూ పక్కనున్న వాళ్లు మొత్తం ఆశ్చర్యపోయారు.నిజంగా మీరు గ్రేట్ అని అతనిని మెచ్చుకున్నారు.ఇక ఈ వీడియోను మోహన్ దాస్ మీనన్ అనే ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దానికి కొన్ని వేల లైక్స్, వ్యూస్ వచ్చాయి. చాలా మంది అతని డేర్ ను పొగుడుతూ కామెంట్స్ చేశారు.మరి ఈ వ్యక్తి చేసిన సాహాసం గురించి మీరేమంటారు.నిజంగా ఇతను గ్రేట్ కదా.మరి ఇతను చేసిన సాహసం గురించి అలాగే ఇలా నీళ్ళ కోసం బోర్ బావి వేసి దానిని పుడ్చకుండా అలాగే వదిలేస్తున్న విషయం మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.