బహిరంగంగా మూత్రవిసర్జన చేయొద్దు అన్నందుకు ఆ నీచుడు ఎంత దారుణానికి పాల్పడ్డాడో తెలిస్తే

640

మన దేశంలో బహిరంగ ముత్ర విసర్జన చేసే వాళ్ళు కొక్కోల్లలు.అది తప్పు అని తెలిసిన కూడా చేస్తూనే ఉన్నాం.అయితే కొంతమంది దీనిని వ్యతిరేకిస్తూ ఉంటారు.కొంతమంది ఊర్లలో అయితే ఇంటి వెనుకలా లేదా ఇంటి పక్కనే విసర్జన చేస్తుంటారు.అయితే ఇప్పుడు ఒక ఘటన జరిగింది.ఒక ఊరిలో ఒక వ్యక్తి ఒక ఇంటి దగ్గర ముత్ర విసర్జన చేశాడు.అలా చెయ్యొద్దు అన్నందుకు ఆ నీచుడు దారుణానికి పాల్పడ్డాడు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for toilets images in roads in india

మహబూబాబాద్ జిల్లా ముల్కలపల్లి గ్రామంలో కోదాటి ఉపేందర్(33), నగరంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో మేదరబజార్‌లో నివసిస్తున్నాడు. అతని ఇంటికి దగ్గరలోని అతని నాయనమ్మ కోదాటి వెంకమ్మ కూడా నివసిస్తోంది. ఈ క్రమంలో వెంకమ్మ ఇంటి ఎదుట అదే ప్రాంతానికి చెందిన యరగాని శ్రీనివాస్ అనే వ్యక్తి మూత్ర విసర్జన చేస్తుండడంతో తన ఇంటి ఎదుట మూత్ర విసర్జన ఎందుకు చేస్తున్నావని వెంకమ్మ శ్రీనును ప్రశ్నించడంతో అతను వెంకమ్మను బూతులు తిట్టాడు.శనివారం ఇంటి వద్దనే ఉన్న తన మనవడైన ఉపేందర్‌తో ఆమె ఈ విషయం చెప్పింది. ఆమెను వెంటబెట్టుకుని, పక్క వీధిలోనే ఉన్న శ్రీను వద్దకు ఉపేందర్‌ వెళ్లాడు.

Image result for toilets images in roads in india

తన నానమ్మను ఎందుకు తిట్టావని ప్రశ్నించాడు.అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న శ్రీను, ఉపేందర్‌ను దుర్భాషలాడుతూ మీదకు వచ్చాడు. తన వద్దనున్న కత్తితో ఉపేందర్‌ గుండెల్లో బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఉపేందర్‌ కింద పడిపోయాడు.స్థానికులు ఉపేందర్‌ను ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో తుదిశ్వాస విడిచాడు. ఈ సంఘటనతో మేదరబజార్‌లో అలజడి చెలరేగింది. మృతుని నాయనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బర్పటి రమేష్ పేర్కొన్నారు. నిందితుడు శ్రీను వన్‌టౌన్ పోలీసుల అదుపులో ఉన్నాడు.ఉపేందర్‌ పెద్ద కుమారుడైన చిన్నారి తనిష్, ఆస్పత్రిలో గుండె పగిలేలా రోదిస్తున్నాడు. ‘‘మా నాన్నను ఆ అంకుల్‌ చంపేశాడు. మా నాన్న ఇంకా రాలేదని వెళ్లాను.

నాన్న పడిపోయాడు. రక్తం కారుతోంది. నాకు భయమేసింది. పరిగెత్తుకొంటూ మా అమ్మను తీసుకొచ్చాను…’’ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ చిన్నారి చెప్పిన విషయమిది. ‘‘పొట్టకూటి కోసం… బతకటానికి ఖమ్మం వచ్చాం. మేమిప్పుడు ఎలా బతకాలి దేవుడా…?’’ అని, తన ఇద్దరు పిల్లలను పొదివి పట్టుకుని గుండె బాదుకుంటూ రోదిస్తోంది స్వాతి. ఆ ముగ్గరినీ ఓదార్చడం ఎవరితరం కాలేదు.విన్నారుగా తన ఇంటి ముందు విసర్జన చెయ్యొద్దు అన్నందుకే ఎలా చంపెశాడో.మరి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు.ఇలాంటి నీచుడిని ఏం చెయ్యాలో మీరే చెప్పండి.అలాగే బహిరంగ ముత్ర విసర్జన ఎంత తప్పో అందరికి తెలిసేలా మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.