హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణహత్య..పోలీసులు చూస్తుండగానే నరికేసిన దుండగులు

446

దేశంలో ఎక్కడ చుసిన హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.ఈ మధ్య ప్రతిదానికి చంపడమే పరిష్కారం అని అనుకుంటున్నారు.ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరిని హత్య చేస్తున్నారు.కారణం ఏదైనా సరే చంపడమే కరెక్ట్ అనే స్థితికి వచ్చారు.ఈ మధ్య మన తెలుగురాష్ట్రల్లో ఎలాంటి ఘటనలు మరీ ఎక్కువయ్యాయి.మొన్ననే ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చంపినా మిర్యాలగూడ ఘటన అలాగే హైదరాబాద్ ఎర్రగడ్డ ఘటనలు మరవకముందే ఇప్పుడు మరొక దారుణ హత్య జరిగింది.మరి ఆ హత్య గురించి పూర్తీగా తెలుసుకుందామా.

హైదరాబాద్ నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.145 దగ్గర రమేష్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్య చేశాడు.రమేశ్ పై కత్తితో దాడి చేస్తున్న ఓ దుండగుడిని యువకుడు వెనుక నుంచి బలంగా తన్నడంతో అతను ముందుకు పడిపోయాడు. అనంతరం పోలీసులు, యువకుడిపై కత్తి రువ్వుతూ బాధితుడిపై మరోసారి దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా పోలీసు వాహనం ముందే ఈ దారుణం జరగడం విచారకరం. తనను రక్షించాలంటూ ఆ యువకుడు ఆర్తనాదాలు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడున్న వారు రక్షించేందుకు ప్రయత్నించినా.. అవతలి వ్యక్తి చేతిలో గొడ్డలి ఉండడంతో భయపడుతూ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దాడి చేసినవారిలో ఇద్దరిని ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. మృతుడు రమేష్ గౌడ్ గా తెలుస్తుంది. ఓ హత్య కేసు విషయంలో కోర్టుకు హజరై వస్తుండగా ప్రత్యర్థులు వెంబడించి అతిదారుణంగా హతమార్చారు.ఈ హత్యలకు పాత కక్ష్యలే కారణంగా తెలుస్తుంది.రాజేంద్ర నగర్ లోని జుమ్మేరాత్ బజార్ లో నివాసముంటే రమేశ్.. తన ఇంటికి సమీపంలో ఉండే మహేశ్ గౌడ్ గొంతు కోసి చంపిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు. ఇదే కేసులో ఈ రోజు కోర్టుకు వెళ్లి వస్తుండగా మహేశ్ బంధువులు వెంటాటి మరీ చంపినట్లు తెలుస్తోంది.ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.