గర్భం దాల్చిన యువకుడు… రిపోర్టులో షాకింగ్ నిజాలు

229

ఈ మధ్య కాలంలో ప్రపంచంలో మన కళ్ళముందు కనిపించే ఆశ్చర్యకర నిజాలు చూసినపుడు కొన్ని టైటిల్స్ వింటే అది వాస్తవమే అయ్యి ఉంటుంది అనుకుంటాం. మనం ఇప్పటివరకు ఆడవాళ్లు గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం గురించి విన్నాం కానీ ఇప్పుడు యువకుడు గర్భం దాల్చాడు. ప్రకృతి సంబంధమైన బంధాలు కూడా సంబంధం లేకుండా అయిపోతున్న ఇలాంటి తరుణంగా ఓ మగాడు గర్భం దాల్చాడు అంటే కచ్చితంగా షాకింగ్ గా ఉన్న, నిజమనే అనుకుంటాం. అయితే అసలు విషయం తెలిసాక మాత్రం డాక్టర్ల నిర్వాకం తెలుస్తుంది..మరి ఏమైందో చూద్దామా.

Related image

మధ్యప్రదేశ్ లో బిండ్ జిల్లా కూపా ప్రాంతంలో ఓ యువకుడు గర్భం దాల్చిన వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ల్యాబ్ మూతపడేంత వరకు వెళ్ళింది. అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్ లోని భిండ్ కి 12 కిలోమీటర్ల దూరంలో గల కూప్ లో శ్యామ్ పాథాలజీ ల్యాబ్ కు 40 ఏళ్ల యువకుడు వచ్చాడు. తనకు జ్వరంగా ఉందని, ఎలాంటి ట్యాబ్ లెట్స్ వేసుకున్నా తగ్గడం లేదని డాక్టర్ కు చెప్పాడు. అయితే అతనిని చెక్ చేసిన డాక్టర్ టెస్ట్ లు చెయ్యాలని చెప్పాడు. జ్వరంతో బాధపడుతున్న అతను వైద్యుల సలహా మేరకు మలేరియా, టైఫాయిడ్ టెస్ట్ చేయించుకున్నాడు.. వారు ఇచ్చిన రిపోర్టు తీసుకుని వైద్యుల వద్దకు వెళ్లాడు. రిపోర్టు చూసిన వైద్యులు షాక్ అయ్యారు. ఇది ఎలా జరుగుతుందని వాళ్ళను వాళ్ళే నమ్మలేకపోయాను. ఎందుకంటే అతను గర్భం దాల్చినట్లు రిపోర్టులో రాయబడి ఉందని చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఇది విని ఆ యువకుడు కూడా షాక్ అయ్యాడు. సాధారణంగా అమ్మాయిలు గర్భం దాల్చుతారు. కానీ అబ్బాయి అయినా తాను ఎలా గర్భం దాల్చాడో అర్థం కాలేదు. ఈ విషయం గురించి అందరికి చెప్పాలనుకున్నాడు. దీంతో రిపోర్టు అందుకున్న యువకుడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అతను పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. అబ్బాయి గర్భం దాల్చిన విషయం సంచలనంగా మారింది. ఇక ఈ వ్యవహారం కాస్తా వైరల్ కావడంతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జేపీఎస్ కుశావాహ్ మాట్లాడుతూ.. అతను ఎలా గర్భం దాల్చాడు అనే విషయం గురించి ఆరా తీస్తున్నాడు. ల్యాబ్ నిర్వాహకునిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ల్యాబ్‌కు తాళం వేసి, విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు.అలాగే అతను నిజంగానే గర్భం దాల్చాడా.. లేక ఇది ల్యాబ్ తప్పిదమా అనే విషయం గురించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అయన వివరించారు. ఇక ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకముందు బ్రిటన్ కు చెందిన ఒక యువకుడు గర్భం దాల్చి ఏకంగా ఒక బిడ్దకే జన్మనిచ్చాడు. కలికాలం అంటే ఇదేనేమో. మరి యువకుడు గర్భం దాల్చిన ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.