ఆడవేషంలో మగాడు… కోరిక తీరలేదని కొట్టి చంపిన మరో వ్యక్తి

235

సమాజములో దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మనుషులు దారుణంగా తయారవుతున్నారు. రేప్ లు కిడ్నాపులు హత్యలు చేస్తున్నారు. అలాగే డబ్బు కోసం నీచపు పనులు చెయ్యడానికి కూడా వెనుకాడటం లేదు. అలా డబ్బు కోసం అడ్డదార్లు తొక్కి చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బు కోసం హిజ్రా అవతారం ఎత్తి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for hijra

వనపర్తి జిల్లా వీపనగుండ్ల మండలం తూముకుంటకు అర్జున్ గత నెలలో హత్యకు గురయ్యాడు. ఊరికి దూరంగా ఉన్న ముళ్లపొదల్లో అతడి మృతదేహం పోలీసులకు లభించింది. అయితే అతడికి ఎవరు హత్య చేశారు ? ఎందుకు హత్య చేశారు ? అనే అంశాలపై విచారణ జరిపిన పోలీసులు చివరికి నిందితుడిని పట్టుకున్నారు. అయితే ఈ హత్యకు సంబంధించి కొన్ని ఆసక్తికర వివరాలను జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి మీడియా ముందు ఉంచారు. వీపనగుండ్ల మండలం తూముకుంటకు చెందిన మందా అర్జున్, డబ్బు కోసం అమ్మాయిలా వేషం మార్చేవాడు. కోరిక తీరుస్తానని పురుషులను ఆకర్షించడం, ఆపై అనుమానం వచ్చిన వారికి తానో హిజ్రానని చెప్పడం, ఆపై ఎంతో కొంత డబ్బు తీసుకుని జల్సాలు చేస్తుండటమే ఇతని పని.ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లా ప్రాంత వాసి భరత్ లాల్ రాయ్ పోలేపల్లి సెజ్ లో కార్మికుడిగా పనిచేస్తూ, తన కామవాంఛ తీర్చుకునేందుకు 10వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో జాతీయ రహదారిపైకి వెళ్లి, ఆడవేషంలో ఉన్న అర్జున్ ను చూశాడు. రూ. 400 ఇచ్చేందుకు బేరం మాట్లాడుకుని, అర్జున్ ను తీసుకుని ఆటోలో సమీపంలోని బూరెడ్డి పల్లి శివార్లకు వెళ్లారు. అక్కడ ఉన్న పొదల్లోకి వెళ్లిన తరువాత భరత్ కు అసలు విషయం తెలిసింది.

ఈ క్రింది వీడియో చూడండి 

 

తనను మోసం చేశావంటూ ఓ రాయితో అర్జున్ తలపై బలంగా మోదిన భరత్, ఆపై అతను ధరించిన చున్నీతో గొంతును బిగించి, ఊపిరాడకుండా చేసి, తానిచ్చిన రూ. 400 తో పాటు అతని సెల్ ఫోన్ ను దొంగిలించుకుపోయాడు.పొలాల్లో యువతి మృతదేహం పడుందని ఫిర్యాదు రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు, అతన్ని ఓ హిజ్రాగా భావించి హైదరాబాద్ లో హిజ్రాలు అధికంగా ఉండే ప్రాంతంలో విచారించినా కేసులో క్లూ సంపాదించలేకపోయారు. చివరకు శంషాబాద్, షాద్ నగర్ ప్రాంతంలో విచారిస్తే అతని పేరు సెల్ నంబర్ లభించాయి. ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ కొనసాగించగా మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో ఫోన్ ఉన్నట్టు తెలియగా అక్కడికి వెళ్లిన పోలీసులు, భరత్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. చూశారుగా ఎంతటి ఘోరం జరిగిందో. మరి ఈ ఘటన గురించైనా అలాగే ఇలా డబ్బు కోసం అడ్డదార్లు తొక్కేవారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.