ఫుల్‌గా తాగిన మైకంలో బతికున్న కోడిని ఏం చేసాడో తెలిస్తే షాక్

631

మద్యం,ఈరోజుల్లో మనిషి ని తన బానిసగా మార్చుకుని తన మత్తులో పడేస్తుంది.మనిషి మత్తులో పడితే ఏం చేస్తాడో అతనికే తెలియదు.మనిషి మద్యం మత్తులో కోతిలా ప్రవర్తిస్తాడు అన్న సంగతి తెలిసిందేఆల్కహాల్ సేవించి వాళ్ళు చేసే పనులు ఒక్కొక్కసారి నవ్వు తెప్పిస్తాయి.వాళ్ళ నడవడిక వాళ్ళ మాటలు అన్ని నవ్వు తెప్పిస్తాయి.అయితే ఇప్పుడు ఒక ఘటన జరిగింది.ఒక వ్యక్తి ఫుల్ గా మందు తాగి ఏకంగా బతికున్న జీవినే తినేశాడు.మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for hen on man

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఇద్దరు యువకులు బాగా మద్యం సేవించారు.బార్ లో కూర్చొని ఇద్దరు పీకల దాకా మందు తాగారు.మరి మందు తాగినప్పుడు ఏమైనా తిన్నాడో లేదో కానీ తాగి బయటకు వచ్చినప్పుడు మాత్రం ఏకంగా ఒక బతికున్న జీవి మీద పడ్డాడు.మందుబాబులకు మద్యం తీసుకునే టైంలో చికెన్ ముక్కలు భలే కిక్కిస్తాయని భావిస్తారు చాలా మంది.అందుకే ఎక్కువగా చికెన్ ముక్కలను తింటారు.అయితే ఇద్దరు యువకులు ఫుల్ గా మద్యం తాగి ఇంటికి బయల్దేరారు.

Image result for hen on man

అయితే ఇంటికి వెళ్లి చికెన్ వండుకుందాం అనుకున్నారో ఏమో గానీ మద్యం మత్తులో ఈ ఇద్దరు యవకులు దగ్గరలోని చికెన్ షాపులో ఓ కోడిని కొనుక్కున్నారు.కోడినీ తీసుకుని ఆర్వోబీ రోడ్డు మీదుగా తాగి ఒకరిపై ఒకరు పడుతూ ఇంటికి వెళ్తున్నారు.మద్యం అధికంగా తాగడంతో సరిగ్గా నడవలేక ఆ ఇద్దరిలో ఒకడు రోడ్డు పక్కనే కూలబడిపోయారు.వాడు నిద్ర మత్తులోకి వెళ్ళిపోయాడు.వాడిని చూసి మరొకడు కూడా అక్కడే కూలబడిపోయాడు.అయితే ఈ యువకుడు చేతిలోని బతికున్న కోడి ఉంది.మరి ఆకలి వేసిందో లేకో తాగింది బాగా ఎక్కిందో ఏమో తెలియదు కానీ వెంటనే తన చేతిలో ఉన్న కోడి మెడను అమాంతం కొరికేశాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బతికుండగానే కోడిని పీక్కుతిన్నాడు.ఈ తతంగం అంతా అటుగా వెళ్తున్నా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇప్పుడు ఈ విడియో వైరల్‌గా మారింది.ఈ వీడియో చూసి అందరు తెగ నవ్వుకుంటున్నారు.వింటుంటే మీకు కూడా నవ్వొస్తుంది కదూ.మరి ఈ ఘటన గురించి మీరేమనుకుంటూన్నారో అలాగే తాగుబోతులు అప్పుడప్పుడు చేసే ఇలాంటి పనుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.