అమ్మాయిలకు మీసాలు, గడ్డం వ‌స్తే త‌ప్ప‌కుండా ఈప‌నిచేయండి అశ్ర‌ద్ద వ‌హిస్తే చాలా ప్ర‌మాదం

624

చాలా మంది అబ్బాయిల‌కు వ‌య‌సు ఎంత వ‌స్తున్నా స‌రిగ్గా గ‌డ్డం రాలేదు అని బాధ‌ప‌డుతూ ఉంటారు… ఇక కొంద‌రు అమ్మాయిల‌కు గ‌డ్డం మీసాలు రావ‌డంతో వారు ఎంతో ఆత్మ‌న్యూన‌త‌గా ఫీల్ అవుతారు.. అస‌లు ఇలా అమ్మాయిల‌కు గ‌డ్డం రావ‌డానికి కార‌ణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముఖంపై వెంట్రుకలు రావడానికి రెండు కారణాలు ఉండచ్చు. వెంట్రుకలు జన్యుపరమైన ( జెనెటిక్) కారణాలతో రావచ్చు. లేదా హార్మోన్స్‌లో తలెత్తిన తేడాల వల్ల రావచ్చు. హార్మోన్స్ సంతులనం తప్పడం వల్ల కూడా అలా ముఖంపై వెంట్రుకలు వస్తాయి…మనిషి శరీరంపై కొన్ని వెంట్రుకలు కచ్చితంగా ఉంటాయి. అలాంటప్పుడు అమ్మాయిల శరీరంపై కాస్త ఎక్కువ వెంట్రుకలు ఉన్నంతమాత్రాన దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ, వెంట్రుకలు చాలా ఎక్కువగా ఉంటే కచ్చితంగా డాక్టరును సంప్రదించాలి.

Image result for girls having hair lips

ముఖంపై చాలా ఎక్కువ వెంట్రుకలు ఉండే స్థితిని ‘హైపర్ ట్రయికోసిస్’ అంటారు. జన్యుపరమైన కారణాలతో ముఖంపై వెంట్రుకలు వస్తే దానిని ‘జెనెటిక్ హైపర్ ట్రయికోసిస్’ అంటారు. ఆ సమస్య హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల వస్తే దానిని ‘హర్‌స్యూటిజం’ అంటారు.హార్మోన్లలో గందరగోళం తలెత్తడానికి పీసీఓడీ( పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్) పెద్ద కారణం కావచ్చు… ఈరోజుల్లో అది చాలా వేగంగా పెరుగుతోందని చెబుతున్నారు డాక్ట‌ర్లు.పీసీఓడీకి ఎక్కువగా మన లైఫ్‌స్టైల్ కారణం అవుతుంది. మన ఆహార అలవాట్లు, బాడీ బిల్డింగ్ కోసం ఉపయోగించే స్టెరాయిడ్స్, గంటలకొద్దీ ఒకే విధంగా కూచోవడం, ఒత్తిడికి గురికావడం వంటివన్నీ పీసీఓడీని మరింత పెంచే అవకాశం ఉంటుంది…వీటి ప్రభావం వల్ల మహిళల్లో టెస్టోస్టిరాన్, ఎండ్రోజెన్ లాంటి హార్మోన్లు పెరుగుతాయట‌…ఎవరైనా ఒక అమ్మాయి ముఖంపై చాలా ఎక్కువగా వెంట్రుకలు ఉంటే, వారు మొదట దానికి కారణం తెలుసుకునే ప్రయత్నంచేయాలి.

Image result for girls having hair lips

కారణం హార్మోన్లే అయితే జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఎక్కువ కేసుల్లో మందులు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.ముఖంపై హఠాత్తుగా వెంట్రుకలు వస్తే అది కేన్సర్ లక్షణం కూడా కావచ్చు. కానీ ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి బ్రిటన్‌లో నివసించే హర్మాన్ కౌర్ గడ్డం ఉన్న అత్యంత చిన్న వయసు మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. అప్పటికి హర్మాన్ వయసు 16 ఏళ్లు. ఆ వయసులో తనకు పాలిసిస్టిక్ సిండ్రోమ్ ఉందని, దాని వల్ల తన ముఖం, శరీరంపై వెంట్రుకలు పెరుగుతాయని ఆమెకు తెలిసింది దీంతో ఆమె ఎంతో నిర‌సించి పోయింది చివ‌రకు ఆమె ఇప్పుడు చికిత్స తీసుకుంటూ క్యూర్ అవుతోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మొత్తానికి ఇటువంటి పరిస్దితులు వ‌స్తే వాటిని షేవ్ చేసి, అక్క‌డ‌ తేనె రాయ‌డం వంటివి చేస్తారు.. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు అని చెబుతున్నారు డాక్ట‌ర్లు.. ముఖ్యంగా ఈ హార్మోనింగ్ బ్యాలెన్స్ వ‌ల్ల ఈ ప‌రిస్దితి ఉంటుంది అని చెబుతున్నారు డాక్ట‌ర్లు…అందుకే ఇలాంటి లేప‌నాలు వాడ‌కుండా ముందే డాక్ట‌రుని సంప్ర‌దించండి… ఈ వీడియోని ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారికి షేర్ చేసి వారికి దీని గురించి తెలియ‌చేయండి. దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల‌ రూపంలో తెలియ‌చేయండి.