సోనాలి చివరి కోరికను తీర్చనున్న మహేష్ బాబు..ఏంటో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

784

మహేశ్ బాబు సరసన మురారి సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన సోనాలీ బింద్రే గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న విషయం తెలిసిందే. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం న్యూయార్క్ లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆమెను ప్రమర్శించారు. తాజాగా మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ కూడా సోనాలీని కలిశారు. మహేష్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ వెకేషన్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. ఐతే ఇక్కడే సోనాలీకి ట్రీట్ మెంట్ జరుగుతుందని తెలుసుకున్న మహేష్, నమ్రతను ఆమె దగ్గరకు పంపించారు. సోనాలిని పరామర్శించిన నమ్రతా చాలా సేపు ఆమెతో టైమ్ స్పెండ్ చేశారు.

ఈ సందర్భంగా ఈ ఇద్దరూ చాలా సేపు, చాలా విషయాలు ముచ్చటించుకున్నారు. సోనాలి, మహేష్ గురించి, పిల్లల గురించి అడిగి తెలుసుకోగా, ఆమె ఆరోగ్యం గురించి నమ్రతా అడిగి తెలుసుకున్నారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని అన్నారు. ఈ క్యాన్సర్ నాకు ఫీవర్ తో సమానం అని, కాకపోతే ఎక్కువ రోజులు హాస్పిటల్ లో ఉంటున్నా అంతే అని అన్నారు. ఈ క్యాన్సర్ తనని ఏమీ చేయలేదని సోనాలి వివరించారు. దీంతో నమ్రతా చాలా సంతోషించారు. ఆ తర్వాత సోనాలి నెక్స్ట్ స్టెప్ ఏంటో అడిగి తెలుసుకున్నారు. దానికి ఆమె బదులిస్తూ “నేను సెలబ్రిటీ కాబట్టి, డబ్బుంది కాబట్టి లక్షలు ఖర్చు పెట్టి క్యాన్సర్ కు ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నాను. అదే డబ్బు లేకపోతే చచ్చిపోవాల్సిందేకదా.

ఇలా డబ్బు లేని కారణంగా చాలా మంది చనిపోతున్నారు? అలాంటి వాళ్ళ కోసమైనా ఏదో ఒకటి చేయాలనుంది. అందుకే నేను క్యూర్ అయిన తర్వాత ఒక ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నాను. అదే నా మొదటి కోరిక, చివరి కోరిక కూడా. ఐతే ఈ విషయం ఇప్పుడే బయటకి చెప్పద్దు. సమయం వచ్చినప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేద్దాం” అంటూ చెప్పుకొచ్చారు. అది విన్న ఆమె సమాధానికి నమ్రతా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన వంతు ఏమైనా చేయాలనుకున్నారు. తన వైపు నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు, ఆ ట్రస్ట్ కి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారని, ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రమోట్ చేస్తారని, తద్వారా ఎంతోమంది క్యాన్సర్ బాధితులు సంతోషంగా జీవిస్తారని, దీని గురించి మహేష్ తో మాట్లాడతానాని సోనాలికి నమ్రతా మాట ఇచ్చారు. ఇప్పటికే మహేష్ బాబు, మరియు నమ్రత పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలానే క్యాన్సర్ బారిన పడుతున్న లక్షల మంది నిరుపేదలకి మన సూపర్ స్టార్ అండగా నిలబడాలని ఆశిద్దాం. ఇక క్యాన్సర్ నుంచి సోనాలి బింద్రే త్వరగా కోలుకొని సంతోషకరమైన జీవితం గడపాలని, అలానే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరాలని ఆకాంక్షిద్దాం. మరి క్యాన్సర్ తో పోరాడుతూ, నిరుపేద క్యాన్సర్  బాధితుల కోసం ఆలోచించిన సోనాలి బింద్రేపై మీ అభిప్రాయం ఏమిటి? వచ్చామా? పరామర్శించామా? వెళ్లిపోయామా అని కాకుండా తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చిన నమ్రతాపై మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయాలు ఏవైనా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి.