హరికృష్ణ చనిపోయిన 5 రోజుల తర్వాత మహేష్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళాడు..మహేష్ చెప్పిన మాటలు విని కన్నీరు పెట్టుకున్న ఎన్టీఆర్

375

నందమూరి హరికృష్ణ మనల్ని వదిలేసి పోయి ఐదు రోజులు అవుతున్నా ఇంకా ఆయనను మరచిపోవడం మన వల్ల అవ్వడం లేదు.ఆయన ఒక్క ఎన్టీఆర్ కొడుకుగా కాకుండా
ఒక రాజాకీయ నాయకుడిగా ఒక సినీ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.అందుకే హరికృష్ణ మరణాన్ని ఎవ్వరూ అంత తేలికగా మర్చిపోలేకపోతున్నారుఅయితే హరికృష్ణ మరణాన్ని మర్చిపోలేక బాధపడుతున్న ఎన్టీఆర్ కాలిన రామ్ లను ఇంకా చాలా మంది ప్రముఖులు ఇంటికి వచ్చి
ఓదార్చుతున్నారు.ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ సతీసమేతంగా వచ్చి ఓదార్చడంట.మరి ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

హరికృష్ణ మరణాన్ని ఎన్టీఆర్ అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నాడు.తనకు జీవితాన్ని ఇచ్చి తనను ఇంతవాడిని చేసి తనకు ఎప్పుడు ఒక రోల్ మోడల్ గా ఉండే తన తండ్రి
లేడు అన్న విషయాన్నీ అస్సలు మర్చిపోలేకపోతున్నాడు.బాధను దిగమింగుకుని షూటింగ్ చెయ్యడానికి కూడా సిద్దమయ్యాడు.కానీ తండ్రి జ్ఞాపకాలకు మాత్రం దూరం
కాలేకపోతున్నాడు.అయితే ఇంత విషాదంలో ఉన్న ఎన్టీఆర్ ను ఓదార్చడానికి సినీ రాజకీయ ప్రముఖులు ఇంకా ఎన్టీఆర్ ఇంటికి వచ్చి వెళ్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు
కూడా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి అతనిని ఓదార్చేందుకు ప్రయత్నించాడంటా.హరికృష్ణ చనిపోయినప్పుడు మహేష్ బాబు ఇండియాలో లేడు.ఫారెన్ లో ఉన్నాడు.అయితే హరికృష్ణ
మరణ వార్త తెలిసిన వెంటనే ఇండియా రావడానికి ప్రయత్నించాడు.కానీ వెంటనే టికెట్స్ దొరకక పోవడం వలన మహేష్ హరికృష్ణ కడసారి చూపులకు రాలేకపోయాడు.మహేష్
వచ్చేసరికే కార్యక్రమం మొత్తం ముగిసింది.

అందుకే ఎన్టీఆర్ ను కలవడానికి ఇప్పుడు వెళ్ళాడు.తండ్రి చనిపోతే బాధ ఎలా ఉంటుందో తెలుసు.కానీ గుండె దైర్యం చేసుకో అమ్మను జాగ్రత్తగా చూసుకో.ఎక్కువగా ఆలోచించి
హెల్త్ ను పాడు చేసుకోవద్దు.జరిగింది మనసులో ఉంటె ఇక ఏ పని మీద కాన్సంట్రేట్ చేయలేము కాబట్టి తొందరగా మర్చిపోయి వెంటనే పని మీద దృష్టి పెట్టు అని మహేష్
ఎన్టీఆర్ దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది.మహేష్ వెంట ఆయన భార్య నమ్రత కూడా వచ్చింది.ఆమె కూడా ఎన్టీఆర్ కు దైర్యం చెప్పినట్టు తెలుస్తుంది.మహేష్ మాటలు తనకు
ధైర్యాన్ని ఇచ్చాయని ఎన్టీఆర్ అన్నట్టు తెలుస్తుంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.