ఆర్టికల్ 370 రద్ధు: పాకిస్థాన్ లో వెలిసిన మహా భారత్ పోస్టర్లు.. బిత్తరపోతున్న పాకిస్థానీయులు

236

జమ్మూ కశ్మీర్ అంశం పాకిస్ధాన్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది నేడు కశ్మీర్ కు వచ్చారు రేపు పీవోకే స్వాధీనం చేసుకుంటే మన పరిస్దితి ఏమిటి అనే ఉద్దేశంలో ఉన్నారు పాక్ నేతలు. జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే కదా. అసలు.. ఆర్టికల్ 370 ని రద్దు చేసిందే పాక్ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి. 370ని అడ్డం పెట్టుకొని పాక్ ఉగ్రవాదులు కశ్మీర్ పై దాడులకు తెగబడుతున్నారు. పీవోకే దాటి వచ్చి జవాన్లపై పంజా విసురుతున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటునుంచి నరుక్కుంటూ వెళ్తోంది. నిజానికి ఆర్టికల్ 370 రద్దు అనేది పాకిస్థాన్ కు మింగుడు పడని వార్త. కశ్మీర్ పై వాళ్ల పెత్తనం ఇక చెల్లదు. కశ్మీర్ లో ఇన్నిరోజులు వాళ్లు చేసిన ఆగడాలు ఇక సాగవు. అయితే… ఇప్పటికే కశ్మీర్ తమకు కాకుండా పోతుందని పాకిస్థానీయులు బాధపడుతుంటే… పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో వెలిసిన కొన్ని పోస్టర్లు వాళ్ల పుండుపై కారం చల్లినట్టుగా ఉన్నాయి.

Image result for jammu and kashmir

ఇస్లామాబాద్ లో మహా భారత్.. ఏ స్టెఫ్ ఫార్వార్డ్(ఒక అడుగు ముందుకు) పేరుతో కొన్ని పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లు ఇండియాకు అనుకూలంగా వెలిసినవి. ఆ పోస్టర్లలో ఏముందంటే… సోమవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370ని రద్దును ప్రతిపాదించాక… శివసేన ఎంపీ సంజయ్ రావత్ సభలో చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే… ఇవాళ మనం జమ్ముకశ్మీర్ ను తిరిగి పొందాం. రేపు బలుచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను కూడా చేజిక్కించుకుంటాం. ఈ ప్రభుత్వం అవిభక్త భారతదేశం కలను నెరవేరుస్తుందని నేను నమ్ముతున్నాను.. అంటూ ఆయన పార్లమెంట్ లో వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ ఆయన వ్యాఖ్యలతో పాటు.. మాట్లాడుతున్న ఫోటోను కూడా ట్వీట్ చేసింది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా పోస్టర్లలో ముద్రించి ఇస్లామాబాద్ వీధుల్లో ఏర్పాటు చేశారు.

Image result for article 370

ఈ పోస్టర్లను గమనించిన కొందరు ఇస్లామాబాద్ వాసులు.. బిత్తరపోయారు. వాటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాకిస్థానీయులు ఏం చేస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. తమ దేశ పరువును తామే తీసుకోవడం ఏంది.. అంటూ ఫైర్ అవుతున్నారు. మన దేశంలో.. మన పట్టణంలో.. హైవేపై ఇండియన్స్ ఈ పోస్టర్లను ఇంత దర్జాగా ఏర్పాటు చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం. మనం నిద్రపోతున్నాం. ఈ దేశ ప్రజలకు ఏం పట్టుకుందో నాకైతే అర్థం కావడం లేదంటూ ఆ పోస్టర్లను చూసిన ఓ పాకిస్థానీ తన ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేశాడు.

ఈ క్రింది వీడియో ని చూడండి

ఇక.. ఈ పోస్టర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఇండియన్స్ కూడా స్పందించారు. పాక్ కు ఇదే సరైన బుద్ధి అంటూ కామెంట్లు చేశారు. కొందరు శివసేన ఎంపీ వ్యాఖ్యలను సమర్థించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా తన దుర్బుద్ధిని బయటపెట్టారు. పాక్ పార్లమెంట్ లో భారత్ పై విమర్శలు గుప్పించారు. ఆధిక్యంలో ఉన్న వర్గాన్ని అణచి వేయడానికి భారత్ ప్రయత్నిస్తోందని… అక్కడి ప్రజలను ప్రతీకారం వైపు నడిపిస్తోందని.. దీని వల్ల మరిన్ని పుల్వామా ఘటనలు పునరావృతం అవుతాయని ఇమ్రాన్ ఖాన్ విషం చిమ్మారు. ఆయన పరోక్షంగా కశ్మీరీలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఇది జరుగుతుందని నాకు ముందే తెలుసు. వాళ్లు మనపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లు మనపై దాడికి దిగితే… మనం కూడా ప్రతిదాడి చేయాల్సిందే.. అంటూ విమర్శలు చేశారు.