వైరల్ గా మారుతున్న ఈ కుక్క చేసిన పని ప్రపంచమే షాక్ అసలు ఏం చేసిందంటే..

360

మ‌నిషికి మ‌నిషి సాయం చేస్తే దీనిని మాన‌వ‌త్వం అంటారు. అయితే ఇంత‌కంటే మాన‌వ‌త్వం మ‌రెవ‌రి ద‌గ్గ‌ర చూస్తాం అంటే, చెప్పేది కేవ‌లం జంతువుల్లో మాత్ర‌మే. అందుకే పిల్ల‌ల‌పై కాకుండా త‌మ జంతువుల‌పై ప్రేమ ఎంతో పెంచుకుంటారు కొంద‌రు.. మ‌రి ముఖ్యంగా ఈ విష‌యంలో చెప్పుకోవాల్సింది కుక్క‌ల‌నే. అందుకే కుక్క‌లు విశ్వాసానికి ఎంతో మారుపేరు.మ‌నిషిలో మాన‌వ‌త్వం ఎలా ఉంటుందో. కుక్క‌లో విశ్వాసం అంత‌కంటే ప‌దిరెట్లు ఉంటుంది.. బ్రెజిల్ లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆలోచింపచేస్తోంది. మరి జ‌రిగిన సంఘ‌ట‌న ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for girls with dogs

బ్రెజిల్ లో ఉద్యోగం చేసే ఓ దంపతులు ఓ 8 నెల‌ల కుక్క పిల్ల‌ని ద‌త్త‌త తీసుకున్నారు.. దానికి లానా అనే పేరు పెట్టారు.. వారు ఉంటున్న ప్రాంతంలో ఇది అంద‌రికి ప‌రిచ‌య‌మే. చాలా అందంగా చూడ‌టానికి ఎవ‌రిని క‌ర‌వ‌కుండాఎక్కువ అర‌వ‌కుండా ఉండ‌టం దీని ప్ర‌త్యేక‌త‌, ఇక ఎక్క‌డికి వెళ్లినా త‌మ కుటుంబంలో ఓ స‌భ్యుడిగా దానిని చూసుకునే వారు ఆజంట‌… ఇక శీతాకాలం రావ‌డం చ‌లి ఎక్కువ‌గా పెర‌గ‌డంతో, లానాకి చ‌లి ఎక్కువ త‌గులుతోంది అని గుర్తించారు.. అందుకే సోమ‌వారం ఉద‌యం దానికి ఎంతో ద‌ట్ట‌మైన మంద‌మైన దుప్ప‌టికి కొని తెచ్చారు.. అది చ‌లి నుంచి త‌ట్టుకుని ఓ మూల ప‌డుకుంటుంది అని అనుకున్నారు.. దానికి ఓ షెల్ కూడా ఏర్పాటుచేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక సోమ‌వారం రాత్రి రోజులాగానే య‌జ‌మానులు కూడా ప‌డుకున్నారు.. ఉద‌యం లేచేస‌రికి లానా క‌నిపించ‌లేదు అంతే కాదు ఆ దుప్పటి కూడా లేదు. దీంతో అనుమానం వ‌చ్చి గేటు ద‌గ్గ‌ర చూశారు .లానా గేటు నుంచి బ‌య‌ట‌కు దూకి బ‌య‌ట ఉన్న వీదికుక్క ద‌గ్గ‌ర ప‌డుకుని ఉంది దీనిని చూసి ఆ జంట షాక్ అయ్యారు. ఇక్క‌డ జ‌రిగింది ఏమిటి అంటే లానా త‌న దుప్ప‌టికి బ‌య‌ట చ‌లిలో ఉన్న వీధి కుక్క‌కు ఇచ్చింది. అది చ‌లితో అర‌వ‌డం విని లానా అక్క‌డ‌కు వ‌చ్చి దుప్ప‌టి ఇచ్చింది అని అక్క‌డ ఉన్న ఓ షాపు వెండ‌ర్ చెప్పాడు.. దీంతో ఆ జంట ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఇలా కూడా కుక్క‌లు ప్రేమ‌ను చూపించుకుంటాయా అని ఆశ్చ‌ర్య‌పోయారు.. ఆ దుప్ప‌టిని వీది కుక్క‌ద‌గ్గ‌ర ఉంచి. లానాని తీసుకుని ఇంటికి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ఆ రెండు కుక్క‌ల ఫోటోని, దుప్ప‌టితో ఉన్న ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. మ‌రి చూశారుగా ఈ ప్రేమ పై మీ అభిప్రాయాన్ని , దీనిపై మీరు ఏమ‌నుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.