బస్సులో ఇలాంటి పనులు చేయడానికి వీళ్ళకి సిగ్గనిపించదా

522

ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఒక మంచి మనసున్న మనిషిది. ఒక ఆడదానికి జీవితాన్ని ఇచ్చిన ఒక సహృదయ వ్యక్తిది. అతని స్టోరీ నేను చెబితే బాగోదు. అతని కథ ఏమిటో అతని మాటల్లోనే విందాం. నా పేరు రమేష్. హైదరాబాద్ నుండి వైజాగ్ కి బస్సు లో వెళ్తున్న సమయం లో ఒక అమ్మాయిని చూసాను. తనది నా పక్క సీటే. చూట్టానికి తను నా అంత వయసు గల అమ్మాయి లాగే ఉంది. కొద్ది దూరం బస్సు లో ప్రయాణించాక తనతో మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టా. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ లో బస్సు ఎక్కాము మేము. 11 వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాము. బస్సు లో అందరూ పడుకుంటున్నారు. తన నెంబర్ ఇచ్చి వాట్సాప్ లో చాట్ చేయండి అందరూ పడుకున్నారు కదా అని తన నెంబర్ ఇచ్చింది. ఇక రాత్రంతా పక్కనున్న తనతో చాట్ చేస్తూ ఉన్నా. సుమారు రాత్రి 2 గంటల సమయానికి తనకి పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త చనిపోయాడు అని చెప్పింది. నా నోటి వెంట మాట రాలేదు.ఈ విషయం ముందే చెప్పొచ్చు కదండీ అని నేను అంటే ఆమె మాట్లాడుతూ…. “చాలా రోజుల తరువాత ఒక వ్యక్తి తో నా జీవితం లో జరిగిన విషయాలను పంచుకున్నా. అమ్మ నాన్న ను విడిచిపెట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నాకు 20 ఏళ్ళు ఉండగానే మ్యారేజ్ చేసుకున్నా. అతని వయసు అప్పటికి 24. పెళ్లి అయి 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇద్దరు పిల్లలు. 6 నెలల ముందు మా ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ 6 నెలల నుండి ఎవ్వరితోను నేను సరిగ్గా మాట్లాడలేదు. నా మనసులోని మాటలు, నా చిన్ననాటి విషయాలు మా ఆయనకు తప్ప ఇంకెవ్వరికి చెప్పుకోలేదు నేను.

ఈ క్రింది వీడియో చూడండి

మీరు ఇవ్వాళ బస్సు లో నన్ను పలకరించే సరికి మొదట భయపడ్డ మాట్లాడాలా వద్దా అని, కానీ చాలా రోజుల తరువాత ఒక మనిషి తనంతటగా తాను నాతో మాట్లాడటం తో నేను మీతో మాట్లాడాను. తెలియకుండానే నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నా. మొదట్లోనే నా పెళ్లి గురుంచి మీతో చెప్పాల్సింది కానీ చెబితే మీరు మాట్లాడరేమో అని భయం వేసి చెప్పలేదు అని చెప్పారు ఆమె. ఆ తరువాత వెంటనే నేను ఏమి మాట్లాడలేకపోయా. బస్సు చివర్లో ఒక సీట్ కాలీగా ఉంటె వెళ్లి అక్కడ పడుకున్నా. పొద్దున్న 8 గంటలకు వైజాగ్ కి చేరుకున్నాం. బస్సు దిగిన వెంటనే ఆమె దెగ్గరకు వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగా. ఆమెకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. నేను ఏ జాబ్ చేస్తున్నా, ఎక్కడుంటున్నా, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎక్స్-గర్ల్ ఫ్రెండ్స్ గురుంచి కూడా ఆమెకు చెప్పాను. ఆమె నాకంటే 4 నెలలు పెద్దది వయసులో. సాయంత్రం లోపు మీ నిర్ణయం చెప్పండి. ఇప్పుడు నాకు కొంచెం అర్జెంటు పని ఉంది. సాయంత్రం మీకు కాల్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోయా.

Image result for lovers in bus

సాయంత్రం ఆమెకు ఫోన్ చేశా. ఆమె ఆర్.కే బీచ్ కు రమ్మంటే వెళ్ళాను. బీచ్ లో కలుసుకున్నాక ఆమె నాతో మాట్లాడుతూ… నా ఇద్దరి పిల్లలు ఇప్పుడు హైదరాబాద్ లో మా అమ్మ దగ్గర పెరుగుతున్నారు. ఒకరికి 3 ఏళ్ళు, మరొకరికి 2 ఏళ్ళు. మా ఆయన చనిపోయి సంవత్సరం కూడా కాలేదు. మీరు పరిచయం అయి ఒక రోజు కూడా అవ్వలేదు. ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవాలి అంటే నాకు భయం వేస్తుంది. మీరు మంచి వారు, ఒక రాత్రి మొత్తం మీ పక్కనే ఉన్నా, మీరు నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు. ఆ ఒక్క విషయం చాలు మీరు ఎంత మంచి వారో చెప్పడానికి. నాకు ఒక సంవత్సరం టైం కావాలి అని ఆమె అడిగారు. నేను సరే అని చెప్పా. ఒక సంవత్సరం వరకు మేము అప్పుడపుడు మాట్లాడుకుంటూ ఉండేవాలం. ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళను నన్ను పెళ్లి చేసుకోడానికి ఒప్పించినాక నన్ను పెళ్లి చేసుకోడానికి ఇష్టమే అని చెప్పారు. మాకు వివాహం అయి 3 ఏళ్ళు అవుతుంది, ఆమెపైన నాకున్న గౌరవం, ప్రేమ ఏనాడూ తగ్గలేదు, ఇకపైన తగ్గదని కూడా నా నమ్మకం.ఇలా మా పరిచయం ప్రేమగా మారింది. మరి మా ప్రేమకథ గురించి నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ అంటారా..మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి.