ఫోటోలు మార్ఫింగ్ చేసి పెళ్లి చెడ‌గొట్టాడని ఈ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాక్

238

అమ్మాయిల‌ను ప్రేమించాను అని చెప్ప‌డం వారికి వ‌ల వేయ‌డం ఈరోజుల్లో కొంద‌రు యువ‌కుల‌కు ఫ్యాష‌న్ అయిపోయింది.. ఇక కొంద‌రు అయితే బ‌డాబాబుల కుమార్తెల‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, చివ‌ర‌కు వారి ప్రాణాలు తీస్తున్నారు, ఆస్తికోసం అద‌న‌పు క‌ట్నం తీసుకురావాలి అని కోరుతున్నారు. చివ‌ర‌కు వీరు ఏమి చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతూ, ప్రేమించిన పాపానికి అక్క‌డే ఉండిపోతున్నారు.ఇక ముఖ్యంగా ఇలాంటి అమ్మాయిల‌కు కౌన్సిలింగ్ ఇచ్చినా, అబ్బాయిల ట్రాప్ లో నుంచి మాత్రం బ‌య‌ట‌ప‌డంలేదు. కాని ఇలాంటి పోకిరీల ప్రేమ‌ను తిర‌స్క‌రించి త‌న జీవితాన్ని నాశ‌నం చేసుకుంది ఓ అమ్మాయి, త‌న‌కు ఇలాంటి ప్రేమలు ఇష్టం లేదు అని చెప్పింది. అయినా ఆ మోనార్క్ ఆమెని వేధించాడు. ఆమెపై ప‌గ పెంచుకున్నాడు. త‌న‌కు ద‌క్క‌ని నువ్వు ఇంకెవ‌రికి ద‌క్క‌కూడ‌దు అని ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు. చివ‌ర‌కు ఆ అమ్మాయి త‌న నిండు జీవితాన్ని కోల్పోయింది.

కొత్త గూడెం జిల్లా ఇల్లందులో దారుణం చోటు చేసుకుంది.. ఓ ప్రేమోన్మాది వేధింపులు త‌ట్టుకోలేక అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఇల్లందులో రెండ‌వ బ‌స్తీలో ఉంటున్న శ్రీనివాస్ ఓ చిరు ఉద్యోగి. ఆయ‌న‌కు సంద్య అనే అమ్మాయి ఉంది. ఆమె ప్ర‌స్తుతం డిగ్రీ చ‌దువుతోంది, ఇక ద‌గ్గ‌ర్లోనే ఉండే సిద్దూ అనే యువ‌కుడు రెండేళ్ల నుంచి ఆమెని ప్రేమిస్తున్నాను అంటూ వెంట‌ప‌డుతున్నాడు. కాని ఆమె అత‌ని ప్రేమ‌ని తిర‌స్క‌రించింది. తాను పెళ్లి చేసుకోను అని ప్రేమ ఇష్టం లేదు అని చెప్పింది, ఇక అత‌నిని శ్రీనివాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు, అయినా సిద్దూ ప్ర‌వ‌ర్త‌న‌లో ఎటువంటి మార్పు రాలేదు.

ఇక సంధ్య‌కు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు వారి త‌ల్లిదండ్రులు. అందుకు బ‌య‌ట‌సంబంధాలు చూడ‌టం మొద‌లు పెట్టారు, ఈ స‌మ‌యంలో వారి ఇంటికి ఓ సంబందం వ‌చ్చింది, సంధ్య‌కు కూడా ఆ సంబంధం న‌చ్చింది. కాని సిద్దూ ఈ విష‌యాన్ని తెలుసుకున్నాడు. సంధ్య‌కి పెళ్లి సెట్ అయిపోతుంది అని ఈ పెళ్లిని చెడ‌గొట్టాలి అని ప్లాన్ వేశాడు, అనుకున్న‌దే త‌డ‌వుగా ఆమెఫోటోల‌ను మార్ఫింగ్ చేసి త‌న‌తో చ‌నువుగా ఉన్న‌ట్లు తీశాడు. వాటిని పెళ్లి చేసుకునే అబ్బాయికి పంపించాడు ..దీంతో ఆ అమ్మాయికిపెళ్లికి ముందే అఫైర్ ఉంది అని ఈ పెళ్లి చేసుకోను అని అన్నాడు కొత్త పెళ్లికొడుకు. ఇక ఈ విష‌యం ఇంట్లో త‌ల్లి దండ్రుల‌కు చెప్పింది, ఇదంతా సిద్దూ చేశాడు అని వారు క‌నుగొన్నారు. కాని ఈలోపు జ‌ర‌గాల్సిన దారుణం జ‌రిగిపోయింది. ఈలోపు ఆమె ఉరివేసుకుని ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకుంది, దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు,ఇక చ‌క్క‌గా పెళ్లి చేసుకుని క‌ళ్ల ముందు తిర‌గాల్సిన అమ్మాయి జీవితం నాశంన చేశాడు సిద్దూ..చూశారుగా అమ్మాయిలు ఫోటోలు కాని ఏమైనా ప‌ర్స‌న‌ల్స్ గాని ఇలా ఫేస్ బుక్ వాట్సాఫ్ ల ద్వారా ఎవ‌రికి పంపించ‌కండి, మీ జీవితాల‌ను నాశ‌నం చేయ‌డానికి కొంద‌రు ఇలా కాచుకుకూర్చుంటారు అనేది తెలుసుకోండి.