ఈ అబ్బాయి నడిరోడ్డుపై మహిళ దుస్తులు లాగేసి ఏం చేశాడో చూస్తే షాక్..

738

సమాజములో స్త్రీలకూ రక్షణ లేదన్నది జగమెరిగిన నిజం. ఎక్కడ చుసిన మానభంగ ఘటనలే వెలుగుచూస్తున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడితే చాలు ఎలా ఆమెను వేదిద్దాం ఎలా ఆమెను లోబరచుకుందాం ఎలా ఆమెను రేప్ చేద్దాం అని ఆలోచిస్తున్నారు. ఎక్కడో జంతువులూ తిరిగే అరణ్యంలో కాదు జనాలు తిరుగుతున్న అరణ్యంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మగాళ్లే జంతువుల లాగా మారి ఆడవారి మీద పడి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.ఆడపిల్ల కంట పడితే చాలు వాళ్ళను వదలడం లేదు. ఇప్పుడు ఒక నీచుడు నడిరోడ్డు మీదనే ఆడపిల్ల బట్టలు లాగేందుకు ప్రయత్నించిండు.మరి ఈ ఘటన గురించి తెలుసుకుందామా.

కర్ణాటక, బనశంకరి కళ్యాణనగర చల్లకెరె వద్ద నివసించే ఒక అబ్బాయి చాలా రోజుల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని వెంటపడుతున్నాడు.ప్రేమ లాంటివి నచ్చక ఆ అమ్మాయి అతనిని దూరం పెట్టింది. ఇంకొకసారి నా వెంట పడితే పోలీస్ కేసు పెడతా అని వార్నింగ్ ఇచ్చింది. అయితే కొద్దీ రోజులుగా ఆమెకు దూరంగానే ఉన్నాడు. అయితే ఈ నెల 8న ఆ అమ్మాయి కిరాణం సామాన్లు కొందామని కిరాణం షాప్ కు వెళ్ళింది. అక్కడే ఆ యువకుడు ఉన్నాడు. అతనిని చూసి ముందు వెళ్లాలా వద్దా అని సంశయించింది కానీ ఇన్ని రోజులు కామ్ గానే ఉన్నాడు కదా అని దైర్యం చేసి వెళ్ళింది.ఆ అమ్మాయి దుకాణం వద్దకు వెళ్తుండగా వెంబడించిన కామాంధుడు ఆ మహిళ చేతులు పట్టుకుని దుస్తులు లాగేందుకు యత్నించాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న బాధితురాలు రక్షణకోసం గట్టిగా కేకలువేసింది.

అంతే అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సదరు యువకుడిని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. హెణ్ణూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టగా యలహంక నివాసి అలుమీన్‌ అని తేలింది. అయితే అతనిని గట్టిగా విచారించగా అతని గురించి కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. అతను గంజాయి సేవించాడని, విదేశీయులకు గంజాయి విక్రయిస్తాడని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. ప్రస్తుతం జైలులో చిప్పకూడు తింటున్నాడు. చూశారుగా ఈ నీచుడు ఎంతటి దారుణానికి పాల్పడ్డాడో. మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.