4 వేల మందితో శృంగారం చేశాడు..ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

336

అదృష్టం దురదృష్టం అనేవి ఎప్పుడు వస్తాయో ఎటునుంచి వస్తాయో ఎవరికీ తెలియదు.ఆ రెండు చెప్పి రావు.అదృష్టం వస్తే బీదవాడిగా ఉన్నవాడు ఉన్నట్టుండి కోటీశ్వరుడు అవుతాడు.అదే దురదృష్టం వస్తే కోటీశ్వరుడిగా ఉన్నవాడు ఉన్నట్టుండి బిచ్చగాడిలా మారుతాడు.ఇలా మారినవారిని మనం చాలా మందిని చూసాం కూడా.అలాంటి ఒక వ్యక్తి గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన అతను ఇప్పుడు కూలీగా జీవిస్తున్నాడు. మరి అలా అవ్వడానికి గల కారణాలు ఏమిటి. ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for romance

స్కాట్లాండ్‌కు చెందిన మైకేల్‌ కరోల్‌ ఒక సాదారణ మద్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చాలా సాదా సీదా జీవితాన్ని గడిపాడు. యుక్త వయసులో ఉన్న సమయంలో మైకేల్‌ ఎన్నో కలలు కన్నాడట. అయితే డబ్బు లేకపోవడంతో అవన్ని కూడా అణచివేసుకుని జీవితాన్ని సాగించాడు. పెళ్లి చేసుకున్న మైకేల్‌ కు ఒక కొడుకు కూడా పుట్టాడు. జీవితంను ఏదోలా మైకేల్‌ ముందుకు తీసుకు వెళ్తున్న సమయంలో అనుకోని అదృష్టం అన్నట్లుగా 2002వ సంవత్సరంలో 10 మిలియన్‌ పౌండ్ల లాటరీ తగిలింది. ఇండియన్‌ కరెన్సీ ప్రకారం దాదాపుగా వంద కోట్లు. ఎవరైనా వంద కోట్లు లాటరీ తగిలితే మంచిగా స్థిరపడేందుకు ప్రయత్నిస్తారు, వ్యాపారాలు చేస్తారు. కాని మైకేల్‌ మాత్రం ఎంజాయ్‌ చేశాడు.వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఎంజాయ్‌ చేయడంకే వినియోగించాడు. జాబ్‌ మానేశాడు, అమ్మాయిలతో తిరగడం, చాలా ఖరీదైన మందును తాగడం, స్నేహితులకు పార్టీలు ఇవ్వడం చేస్తూ వచ్చాడు. కొన్ని రోజులకు మైకేల్‌ భార్య అతడిని వదిలి వెళ్లి పోయింది. అతడు చేస్తున్న ఖర్చు, అతడి ప్రవర్తన భరించలేక ఆమె విడాకులు తీసుకుంది. భార్య పిల్లలు లేకపోవడంతో మైకేల్‌కు అడ్డు లేకుండా పోయింది. విచ్చల విడిగా ఖర్చు పెడుతూ దేశ విదేశాలు తిరుగుతూ మరీ ఎంజాయ్‌ చేశాడు. 15 ఏళ్ల కాలంలో ఏకంగా 4000 మందితో శృంగార సంతృప్తి చెందాట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రస్తుతం మైకేల్‌ తన వద్ద ఉన్న డబ్బును అంతా కూడా పోగొట్టుకున్నాడు. డబ్బు ఏం లేకపోవడంతో ప్రస్తుతం కూలీ పని చేస్తున్నాడు. వంద కోట్ల రూపాయలను 15 ఏళ్లలో నీళ్లు ఖర్చు పెట్టినట్లుగా ఖర్చు పెట్టి ఇప్పుడు కూలీ పని చేస్తున్నాడు. ఇతడు తాజాగా స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతడు చేసిన పనులను చెప్పాడు. కనిపించిన ప్రతి అమ్మాయికి వేలకు వేలు ఇచ్చేవాడిని అని, ఎంతో మంది అమ్మాయిలు నా వద్ద డబ్బును చూసి నా వద్దకు వచ్చే వారు, ఇక నా గురించి తెలిసి ఖరీదైన మందును నా కోసం బార్‌ వారు ఇచ్చే వారు. అలా నా తాగుడు మరియు శృంగార కోర్కెలను తీర్చుకునేందుకు నా వద్ద ఉన్న డబ్బు అంతా ఖర్చు చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.నా యుక్త వయసులో ఎన్నో కోరికలు అణచి వేసుకుని బతికాను, అందుకే డబ్బు వచ్చినప్పుడు ఆ కోరికలన్నీ తీర్చుకోవాలనుకున్నాను. తీర్చుకున్నాను, కాని నావద్ద ఇప్పుడు ఏమీ లేకపోవడం కాస్త బాధగా అనిపిస్తుందని, గడిపిన కాలంను గుర్తు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తానంటూ చెప్పుకొచ్చాడు.విన్నారుగా ఈ అదృష్టదురదృష్ట వంతుడి గురించి. మరి ఈ వ్యక్తి గురించి ఇలా ఉన్నప్పుడు అనుభవించి చివరికి బికారిలా మారేవారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.