చేపల కోసం ‘సెక్స్’… అక్కడ మహిళల పరిస్థితి గురించి తెలిస్తే షాక్

610

ప్రతి ఒక్కరు తిండి కోసమే కష్టపడేది. ఎవరు ఏ కష్టం చేసినా కడుపు కోసమే. మూడు పూటల తిండి కోసం కొందరు పడే బాధలు అన్నీఇన్నీ కావు. అయితే ఒకచోట మాత్రం కడుపు నిండాలంటే పడుపు వృత్తే దిక్కు. ఒకరి దగ్గర పడుకుంటే తప్పా అక్కడ మహిళల కడుపు నిండదు. రోజు నరకం అనుభవిస్తే గాని వారి కడుపు నిండదు. అంతటి దీన అవస్థ బతుకుతున్నారు. మరి వారి జీవన చిత్రం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

కెన్యాలో మహిళలు కడుపు నింపుకోవడం కోసం పడుపు వృత్తినే ఎంచుకుంటున్నారు. చేపల కోసం సెక్స్ చేయాలనే ‘జబ్వా’ అనే వింత సంస్కృతి ఇప్పటికే అక్కడి మహిళలకు జీవనాధారమవుతోంది.ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది ఇలా బతుకుతున్నారు. రచెల్ అటినో అనే 32 ఏళ్ల మహిళకు ఐదుగురు సంతానం. పదేళ్ల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. ఐదుగురు పిల్లలను పోషించాల్సిన బాధ్యత రచెల్ భుజాలపై పడింది. దానికి ఆమె ఎంచుకున్న మార్గం ‘జబ్వా’. కెన్యాలోని విక్టోరియా లేక్ సరిహద్దు తీరం వెంబడి ఉన్న సియాయా తెగ మహిళల్లో చాలా మంది ‘జబ్వా’నే జీవనాధారంగా ఎంచుకుంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక్కడ డబ్బులు ఇచ్చి చేపలు కొనుక్కుని వెళ్లే మహిళలు అత్యంత అరుదుగా కనిపిస్తారంటే. పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ‘సెక్స్ ఎక్స్చేంజ్’ ద్వారానే చేపలు కొంటుంటారు. విక్టోరియా లేక్‌లో పగలంతా చేపలు పట్టే పురుషులు, రాత్రివేళల్లోనే వాటిని అమ్ముతుంటారు. డబ్బులు ఇచ్చి కొనుక్కెళ్లేవారి కంటే, సెక్స్ చేసేందుకు రెఢీగా ఉండే వాళ్లకు మంచి మేలురకం చేపలు అమ్ముతారట వేటగాళ్లు. ఈ పురాతన ‘వ్యభిచార మారకం’ నుంచి తప్పించుకోవాలని చాలామంది మహిళలు కోరుకున్నప్పటికీ, దేశంలోని ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించడం లేదు.ఇలా ఎన్నాళ్ళు బతకాలో అని అక్కడి మహిళలు బాధపడుతున్నారు. వీరి సమస్య త్వరగా తీరిపోయి వారి జీవన వ్యవస్థ మారాలని కోరుకుందాం. మరి కెన్యా మహిళలు అనుభవిస్తున్న ఈ దారుణ జీవన విధానం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.