పీరియడ్స్ సమయంలో సెక్స్ చేస్తే గర్భం వస్తుందా డాక్ట‌ర్ స‌మాధానం వింటే షాకవుతారు..

445

చాలా మందికి శృంగారంలో అనేక సందేహాలు ఉంటాయి.. ఆ స‌మ‌యంలో ఇలా చేయ‌వ‌చ్చా, అస‌లు లైంగికానందం ఇలా పొంద‌వ‌చ్చా, ఏ స‌మ‌యంలో సెక్స్ చేస్తే మంచిది.. ఇలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి.. మ‌రీ ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకు ఇలాంటి స‌మ‌స్య‌లు ప్ర‌శ్న‌లు నిరంత‌రం వేధిస్తూ ఉంటాయి.. ఇక వారికి ఎన్నో రిఫ‌రెన్స్ పుస్త‌కాలు- వీడియోలు చూసినా దీని గురించి పెద్ద‌గా తెలియ‌దు.. ఈ స‌మ‌యంలో చాలా మందికి తెలియ‌ని ఓ డౌట్ గురించి డాక్ట‌ర్ ఏం స‌మాధానం చెప్పాడో చూడండి.. ఓ మ‌హిళ ఆ డాక్ట‌ర్ ని అడిగిన ప్ర‌శ్న ఏమిటి అంటే?

Image result for pregnancy

నాకు పెళ్లయి నాలుగేళ్లు అవుతుంది. మాకు పిల్లలు కలగలేదు. ఇక నాకు పీరియడ్స్ వచ్చిన సమయంలో కాస్త ఆరోగ్యం అంతగా బాగుండదు. ఏదో నలతగా ఉన్నట్లు ఉంటుంది. ఆ సమయంలో ఫుల్ రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది.అయితే మా ఆయన ఈ మధ్య నాకు ఒక విషయం చెప్పారు. పీరియడ్స్ వచ్చినప్పుడు సెక్స్ లో పాల్గొంటే గర్భం వస్తుందని ఆయనతో ఎవరో చెప్పారంట. దీంతో నన్ను ఆ సమయంలో సెక్స్ లో పాల్గొనమని పట్టుపడుతున్నాడు.

Image result for pregnancy

నాకు ఆ టైమ్ లో చాలా చిరాగ్గా ఉంటుంది. నా శరీరం అందుకు అస్సలు సహకరించదు. నిజంగా పీరియడ్స్‌ వచ్చిన సమయంలో సెక్స్‌ లో పాల్గొంటే ప్రెగ్నెంట్ అవుతానా? అలా అవుతానంటే ఓపిక చేసుకుని అందులో పాల్గొంటాను. మా ఆయన పిల్లలు కలగలేదని బాధపడుతున్నాడు. అందువల్ల నేను ఆ సమయంలో సెక్స్ కు ఒప్పుకుందామనుకుంటున్నాను అని డాక్ట‌ర్ ని ప్ర‌శ్నించంది ఆమె..

 

….డాక్ట‌ర్ దీనికి ఏమి స‌మాధానం చెప్పారంటే…

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పీరియడ్స్ లో టైమ్ లో సెక్స్ లో పాల్గొంటే గర్భం వస్తుందనేది అపోహ. ఆ సమయంలో కలయిక అనేది కొందరు స్త్రీలకు అస్సలు ఇష్టం ఉండదు. మీకు ఆ సమయంలో అందులో పాల్గొనాలని లేకుంటే పాల్గొనకండి. పీరియడ్స్ వచ్చిన తర్వాత పదకొండు నుంచి పదహారో రోజు మధ్యలో అండం విడుదలయ్యే అవకాశం ఉంది.మీరు అండం విడుదలైన సమయంలో సెక్స్ లో పాల్గొంటే గర్భిణీ అయ్యే అవకాశం ఉంటుంది. పీరియడ్స్ వచ్చినప్పుడు అండం విడుదల కాదు. మీకు ఆ రోజు ఆరోగ్యం సరిగ్గా ఉండదని చెబుతున్నారు కాబట్టి మీరు ఆ రోజు ప్రశాంతంగా ఉండండి. మీ ఆయన ఇవన్నీ చెప్పి చూడండి. ఆయన అర్థం చేసుకోకుంటే, డాక్టర్ వద్దకు తీసుకెళ్లి డాక్టర్స్ తో చెప్పించండి. ఆయన అపోహల వల్ల మీరు ఇబ్బందులుపడకండి. ఆ సమయంలో సెక్స్ చేసుకోవడం తప్పు మాత్రం కాదు. కొందరు కండోమ్ యూజ్ చేసి సెక్స్ చేసుకుంటారు. కానీ ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే కచ్చితంగా గర్భం వస్తుందనేది మాత్రం అపోహ.99 శాతం ఇది నిజం అని ఆ డాక్ట‌ర్ ఆమెకి తెలియ‌చేశారు. మ‌రి చూశారుగా ఆ స‌మ‌యంలో సెక్స్ చేసినంత మాత్ర‌న గ‌ర్బం దాల్చే అవ‌కాశం ఏమాత్రం లేదు. ఈ ప్ర‌శ్న‌.. స‌మాధానం పైమీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.