ప్రేమించి లేచిపోయిన కూతురు 2 ఏళ్ళ తరువాత తండ్రికి ఏడుస్తూ లెటర్

224

ఏంజిల్..ప్రాణం ..బంగారు కొండ ఇవన్నీ నేనే..మా నాన్నకు..చాక్లెట్లు బొమ్మలు డ్రస్ లు స్కూటీ ఇవేంటి అడక్కముందే కొండ మీద కోతినైనా తీసుకొచ్చి ఇచ్చేవారు..నేనేడిస్తే ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి..నేను నవ్వితే ఆయనకు పండుగ..నాన్నంత కాకపోయినా అమ్మకు నేనంటే ఇష్టమే..ఇంటర్ దాకా నాన్న చాటు బిడ్డనే..బి టెక్ లో నాకో కొత్త బంగారు లోకం పరిచయమయింది..అందుకు కారణం రామ్..అర్జున్ రెడ్డి సినిమాలో హీరోలా ఉండేవాడు..ఎవర్నీ లెక్క చేయని మనస్తత్వం..అనుకున్నది చేసేస్తాడు..కాలేజ్ లో అమ్మాయిలకి అతనంటే క్రేజ్..

అలాంటిది తనంతట తానొచ్చి మాట కలిపాడు..ముందు అవాయిడ్ చేసా..మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటే కాదనలేకపోయా..సెకండ్ ఇయర్ వచేసరికి మాటలు దాటి చాటుమాటుగా కలుసుకునేదాకా వెళ్ళాం..వీకెండ్ లో సినిమాలు ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు..దుప్పట్లో దూరి వాట్సప్ లు..వీడియో చాటింగ్ లు..అందరు ప్రేమికుల్లాగానే మా పెళ్ళికి నాన్న ఒప్పుకుంటారని నా నమ్మకం..అదే ధైర్యంతో ఫైనల్ ఇయర్ లో మా ప్రేమ విషయం చెప్పా..అబ్బాయి గురించి కనుక్కుంటా కొంత టైమ్ ఇవ్వమ్మా అన్నారు..జరగబోయే వేడుక ఊహించుకుంటూ గాల్లో తేలిపొయా..వారం 15 రోజులు గడిచాయి..నాన్న ఏ విషయం తేల్చరే..నిన్ను నాకిచ్చి చేయడం మీ డాడీకి ఇష్టం లేదేమో..వాయిదా వేస్తూ ఉంటే నీ మనసు మారుతుందని ఆయన ప్లాన్..ఆవేశ పడిపోయాడు రామ్..

నాకు అదే అనిపించి నిలదీసా..కులం డబ్బు పట్టింపులు నాకు లేవమ్మా..కానీ అబ్బాయి క్యారక్టర్ బాగులేదని నాకు తెలిసింది..చదువులోను వెనుకే..ఒక్కసారి ఆలోచించు ప్లీజ్..అభ్యర్దించారు నాన్న..ప్రేమ మైకంలో కూరుకుపోయిన నాకు అవేమీ చెవికెక్కలేదు..నేను పట్టు వదల్లేదు..కన్నవాళ్ళు మెట్టు దిగలేదు..మేము మీ పెళ్ళి పెద్దవాళ్ళం అవుతాం..అన్నారు ఫ్రెండ్స్..నా బ్యాంకు ఖాతాలో నాన్న వేసిన మొత్తం ఉంది..గడప దాటాం..గుళ్ళో దండలు మార్చుకున్నాం..సిటీలో కాపురం పెట్టాం..ఆర్నెళ్ళు చిలకా గోరింకల్లా ఉన్నాం..ఆ తరువాత మొదలయ్యాయి కష్టాలు..ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి..ఫ్రెండ్స్ సాయం ఆగిపోయింది..పస్తులుండాల్సిన పరిస్థితి..

గత్యంతరం లేక ఓ దుస్తుల దుకాణంలో సేల్స్ గర్ల్ గా చేరా..తనకు డిగ్రీ లేదు..చిన్న పనులు చేయడానికి నామోషీ..ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి..కనీసం బిటెక్ పూర్తి చేసినా ఏదైనా జాబ్ చేసే వారుగా..అన్నానోసారి.. కాలేజ్ లో రోజూ మీ చుట్టే తిప్పుకున్నాం..ఇంక నేనేం చదువుతాను..అన్నాడు కర్కశంగా..నా గుండె ముక్కలయింది..నా వెంట పడింది తను..జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటా అన్నది తను..ఇప్పుడు మాట మార్చేసాడు..మాటి మాటికీ కసురుకోవడం..చీటికీ మాటికీ అరవడం పరిపాటయింది.. ఓ రోజు నేను అమ్మను కాబోతున్నాను అని తెలిసింది.. అదే సమయంలో రామ్ మరో అమ్మాయితో లవ్ నడిపిస్తున్నాడని తెలిసింది..పొగిలి పొగిలి ఏడ్చా..తనపై కోపంతో కడుపులో పిండాన్ని చిదిమేసుకున్నా..

రెండేళ్ళు గడిచాయి..తను మారతాడని..నాపై ప్రేమ కురిపిస్తాడని..ఎదురు చూసి అలిసిపొయా..ఎంతో పోరు పెడితే ఏదో పనిలో చేరతాడు..నెలా రెండు నెలలు గడవగానే మానేస్తాడు..ఇక నా ముందే అమ్మాయిలతో ఫోన్ లో సరసాలు..ఇలాంటివాడిని ప్రేమించినందుకు నాపై నాకే కోపం..అసహ్యం వేస్తోంది..ఈ బాధలో అమ్మా నాన్నలు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపు ఆగడం లేదు..మా నాన్న ఎంత గొప్పవారు..ప్రేమిస్తున్నా నాన్న అంటే కోపంతో రగిలిపోలేదు..నా భవిష్యత్తు ఆలోచించి మంచి మాట చెప్పారు..పెడ చెవిన పెట్టిన నాకు ఈ శాస్తి జరగాల్సిందే..ఇప్పటికిప్పుడు ఇంటికెళ్తే నా గుండెలకు హత్తుకుంటారని తెలుసు.. కానీ నాకే మొహం చెల్లడం లేదు..

నాన్న నీ మాట వినక తప్పు చేసా..కన్నీళ్ళతో నీ పాదాలు కడగాలని ఉంది..ప్రేమ పెద్దల్ని ఎదిరించి పెళ్ళి చేసుకోవడం హీరోయిజం లాగే ఉంటుంది..కానీ తప్పుడు వ్యక్తిని ఎంచుకుంటే నాలాగే ఏడవాల్సి వస్తుంది..కాలు గడప బయటపెట్టే ముందు ఓ సారి ఆలోచించండి..చూసారుగా అమ్మాయి ఆవేదన….మీ దృష్టిలో ప్రేమ పెళ్ళి గొప్పదా..పెద్దలు కుదిర్చిన పెళ్ళి గొప్పదా..అన్న విష్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..