లారెన్స్ చారిటబల్ ట్రస్ట్ ఆపరేషన్ చేయించుకోలేని వారు కాల్ చేయండి

18942

ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత రోగాలు అనేక మంది ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతున్నాయి, ముఖ్యంగా గుండెలో ఏర్పడే రంధ్రాల వల్ల అనేక మంది చిన్న చిన్న పిల్లలు మరణిస్తున్నారు, ఈ గుండె జబ్బులకి ఆపరేషన్ చేయించే అంత ఆర్థిక స్థోమత లేకపోవటం వల్ల అనేక మంది పిల్లలు మరణిస్తున్నారు, ఇలాంటి వారికి తన సొంత డబ్బుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి డాన్సర్, యాక్టర్ అయిన రాఘవ లారెన్స్ ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయిస్తున్నాడు, తను సంపాదించిన దాంట్లో కొంత మొత్తం దాతృత్వ కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నాడు లారెన్స్.

Image result for larence

తాజాగా ఓ చిన్నారి హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిన విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు లారెన్స్. శివాని అనే బాలిక గుండెలో చిన్న రంధ్రం ఉంది. వారిది నిరుపేద కుటుంబం. ఈ విషయం తెలుసుకున్న లారెన్స్.. చిన్నారికి ఆర్థిక సాయంతోపాటు వైద్య చికిత్స అవసరం అయిన అన్ని వసతులను దగ్గరుండి చూశారు. ఆపరేషన్ చేయించారు. పాప ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. ఈ విషయాన్ని చెబుతూ.. ‘మా 141వ ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతమైంది! ఈమె శివాని. వయసు ఒక సంవత్సరం. ఈమె గుండెలో చిన్న రంధ్రం ఉంది. ఆమెకు విజయవంతంగా ఆపరేషన్ చేయించి ఇంటికి పంపించాం. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న డాక్టర్ల బృందానికి, ఇతర సభ్యులకు ధన్యవాదాలు’ అని తన ఫేస్‌బుక్ పేజ్ లో పోస్ట్ చే శాడు.

ఎవరైనా చిన్నపిల్లలు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ, తల్లిదండ్రులు వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ఉన్నట్లు మీకు తెలిస్తే తమకు తెలియజేయాలని లారెన్స్ కోరారు. దయచేసి “ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్” ఫోన్ నంబర్లు 09790750784, 09791500866కు ఫోన్ చేసి విషయం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.ఎటువంటి స్వార్థం లేకుండా పేదలకోసం ఇలాంటి పనులు చేస్తున్న రాఘవ లారెన్స్ ని మనం ఆదర్శంగా తీసుకుంటూ అభినందించాల్సిందే..