ప్రియుడిచ్చిన సిమ్ భర్త ఫోన్‌లో వేసి కాల్స్ మాట్లాడింది చివ‌ర‌కు భ‌ర్త ఎలా ప‌ట్టుకున్నాడో తెలిస్తే షాక్

572

పూర్ణా మార్కెట్‌ సమీపంలోని ప్రసాద్‌ గార్డెన్‌ వద్ద పండా వీధిలో వడిసెల మోహనరావు నాగమణి కుటుంబాలు ఇరుగుపొగురున ఉండేవి. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మోహనరావు ఒక ట్రాన్స్‌పోర్టు కంపెనీలో కలాసీగా పని చేస్తుండగా, నాలుగేళ్లుగా నాగమణి సిరిపురంలోని ఓ రెస్టారెంట్‌లో మేడ్‌గా పని చేస్తున్నది. ఈ నేపథ్యంలో రెస్టారెంట్‌లో పని చేస్తున్న కిషోర్‌తో నాగమణికి పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత కొన్ని నెలలుగా నాగమణి వ్యవహార శైలిలో మార్పు రావడంతో మోహనరావుకు అనుమానం వచ్చింది. అదే సమయంలో మోహనరావు సెల్‌ఫోన్‌ను కాజేసి ప్రియుడు కిషోర్‌ ఇచ్చిన సిమ్‌లో అందులో వేసి భర్తకు తెలియకుండా ప్రియుడితో మాట్లాడుతుండేది. దీన్ని గ్రహించిన మోహనరావు భార్యను గట్టిగా నిలదీయడంతో కిషోర్‌ అనే వ్యక్తితో తనకు వివాహేతర సంబంధం ఉందని చెప్పింది.

Image result for girl in jail

అప్పటి నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థలు మొదలై తరచూ గొడవలు జరిగేవి. రెండుసార్లు పెద్దల వద్ద పంచాయితీ కూడా జరిగింది. ఎవరి చెప్పినా నాగమణి తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఈ క్రమంలో భార్యపై కోపం పెంచకున్న మోహనరావు రెండు రోజుల కిందట నాగమణిని కొట్టి టవల్‌ను పీకకు చుట్టి చంపబోయాడు. అప్పటి నుంచి నాగమణి తమ పుట్టింట్లో ఉంటూ విధులకు రెస్టారెంట్‌కు వెళ్లేది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్న మోహనరావు శనివారం రాత్రి రెస్టారెంట్‌లో విధులు ముగించుకొని నాగమణి ఆటోలో రాగా, ఆమెను వెంబడించి నవరంగ్‌ థియేటర్‌ వద్ద ఘర్షణ పడ్డారు. అక్కడ తనతో పాటు తీసుకొచ్చిన కత్తితో నాగమణిపై విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. నిందితుడు మోహనరావును పోలీసులు అదుపులోకి విచారించగా.. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగానే హతమార్చినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ కేసును పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. నిజంగా ఆమెకు అత‌నితో వివాహేత‌ర సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు… మొత్తానికి ఇలాంటి అనుమానంతో త‌మ కుమార్తెని చంపాడు అని అలాగే త‌మ కుటుంబంలో చిచ్చు పెట్టాడు అని అంటున్నారు..ఇద్ద‌రుపిల్ల‌లు ఇప్పుడు త‌ల్లిదండ్రి లేక అనాథ‌లు అయ్యారు అని అంటున్నారు.. మ‌రి చూశారుగా క్ష‌ణికావేశంలో ఇలాంటి దారుణాలు జ‌రుగుతున్నాయి. వారు తీసుకునే నిర్ణ‌యాలు ఆకుటుంబాన్ని ఎలా అగాధంలో నెట్టివేశాయో. మరి ఈ ఘ‌ట‌న‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.