పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు

177

భార‌త్ సైలెంట్ గా ఉంటే పాక్ త‌న దూకుడు చూపిస్తోంది, నిశ్శ‌బ్దంగా త‌నప‌ని తాను చేసుకుపోతోంది ఆ ముసుగులో భార‌త్ ని దెబ్బ తీయాల‌ని చూస్తోంది.. తాజాగా పాక్ కవ్వింపు చర్యలకు భారత్ చెక్ పెట్టింది. తరచూ సరిహద్దులో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న పాక్‌కు ఆదివారం భారత ఆర్మీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఉదయం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడస్తూ.. కుప్వారా జిల్లాలోని తాంఘర్ సెక్టార్‌లో భారత బలగాలపైకి కాల్పులు జరిపాయి. దీంతో భారత ఆర్మీ.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది. ఆర్టిలరీ గన్స్‌ను ఉపయోగించి.. ఉగ్ర క్యాంపులే లక్ష్యంగా కాల్పులకు దిగింది. ఈ దాడిలో పలు టెర్రర్ క్యాంపులు ధ్వంసమయ్యాయి. అంతేకాదు ఐదుగురు పాక్ ఆర్మీ జవాన్లు చనిపోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలమ్ వ్యాలీలోని నాలుగు ఉగ్రస్థావరాలను టార్గెట్ చేస్తూ భారత ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఆ నాలుగు క్యాంపులు నేలమట్టమైనట్లు తెలుస్తోంది.

Image result for indi a and pak war

అంతకు ముందు పాక్ ఆర్మీ.. కుప్వారా జిల్లాలోని తాంఘర్ సెక్టార్‌‌లోని భారత సైనిక స్థావరాలే టార్గెట్‌గా దాడులకు దిగింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందగా.. స్థానికులు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పాక్ కాల్పులతో సరిహద్దు గ్రామాల్లోని మరో ఇద్దరు పౌరులు కూడా గాయపడ్డారని సమాచారం అందుతోంది. అలాగే రెండు ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో చూడండి

ఓ వైపు కాల్పులు జరుపుతూ.. మరోవైపు నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి చొరబడేలా చేస్తుండటాన్ని భారత ఆర్మీ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ.. పాక్ ప్రేరేపిత ఉగ్ర స్థావరాలపై దాడులకు దిగింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుల్లెట్ల వర్షం కురిపించింది. భారత సైన్యం కాల్పుల్లో పాకిస్థాన్‌‌వైపు కూడా భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరిన్ని దురాగతాలకు పాల్పడుతోంది. వారం రోజుల వ్యవధిలో పాక్ సైన్యం బరితెగింపుల వల్ల నలుగురు సైనికులు అమరులయ్యారు.ఇలా పాక్ ఇష్టం వ‌చ్చిన రీతిలో త‌న దూకుడు చూపించ‌డం ప‌ట్ల తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త భార‌త్ నుంచి వ‌స్తోంది.. భార‌త్ మ‌రింత చావుదెబ్బ పాకిస్ధాన్ ని తీయాలి అని సోష‌ల్ మీడియాలో భార‌త నెటిజ‌న్లు కూడా కోరుకుంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి