ప్రాణం తీసిన సరదా.. తెలుగు టిక్ టాక్ స్టార్ సోనిక కన్నుమూత!

2044

సోనికా కేతావత్… టిక్ టాక్, యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైజాగ్‌కు చెందిన ఈ బిటెక్ అమ్మాయి తనలోని యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టపడే సోనికా… ఇటీవల తన స్నేహితులతో కలిసి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. బైక్ రైడింగ్ చేస్తూ వీడియో తీస్తుండటం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఇంత కాలం తన వీడియోలతో అలరించిన ఈ కుర్ర స్టార్ ఇక లేరనే విషయం చాలా మంది అభిమానులను బాధించింది, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.

Image result for టిక్ టాక్ స్టార్ సోనిక

నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్రపాటి టోల్ గేటు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అతివేగంగా వస్తున్న బైక్ సైకిల్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితమే ఈ ఘటన చోటు చేసుకోగా, చికిత్స పొందుతూ సోనిక మరణించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన సోషల్ మీడియా మాధ్యమం టాక్ టాక్‌లో సోనికా కేతావత్ తన వీడియోలతో లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఆమె సినిమాల వైపు వస్తే బావుంటుందని సలహాలు ఇచ్చినవారు ఎందరో… అయితే ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో సోనికతో పాటు ఆమె స్నేహితుడు కూడా గాయాల పాలయ్యారు. అయితే మొదట సోనిక చిన్న గాయాలతో బయటపడిందని అంతా భావించారు. అయితే ఆ గాయాల కారణంగా ఆరోగ్యం విషమించి చివరకు ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైనట్లు తెలుస్తోంది. అయితే సోనికా కేతావత్ రోడ్డు ప్రమాదంలో మరణించడం అభిమానులను షాక్‌కు గురి చేసింది.

ఈ క్రింద వీడియో చూడండి

రోడ్లపై ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. బైక్ మీద వెళుతూ సరదా కోసం వీడియోలు తీస్తే ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుని అవి చివరకు విషాదాలకు దారి తీస్తాయని చెప్పడానికి ఈ ప్రమాదం ప్రత్యక్ష నిదర్శనం. టిక్ టాక్‌లో పరిచయం ఓకే.. లాంగ్ రైడ్ వెళ్ళావ్, ఏమైంది, చివరకి నీ ప్రాణాలు పోయాయి, వాడికి కామన్ సెన్స్ లేదు, డ్రైవ్ చేసేటపుడు ఫోన్‌లో ఫొటోస్ తీయకూడదు అని.. నువ్వు అయినా చెప్పాలి కానీ నువ్వు డ్రైవ్ చేస్తూ వాడ్ని వెనక నుండి సెల్ఫీ తీయమనడం ఏంటి.. నిదికూడా తప్పే.. #RipSonarika….అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. Tiktok కన్నా… అందులో పరిచయం అయినా వాళ్ళ కన్నా… మిమల్ని కన్న మీ తల్లిదండ్రులు ముఖ్యం, వాళ్ళ తరవాతే ఎవరైనా. ఇద్దరికీ ఆక్సిడెంట్ అయినా, నీకు ఏమీ కాలేదు అని వాడి ఒకడి కోసం ఫండ్స్ కలెక్ట్ చేసి, నిన్ను చంపేశారు నువ్వు నమ్మిన ఫ్రెండ్స్… ఈ సృష్టి‌లో మనల్ని కన్నవారు కన్నా ఎవరు ఎక్కువ కాదు…. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందరూ కలిసి చంపేశారు సార్, పాపం వాడి కోసం వెళ్లి బలైపోయింది.. ఆక్సిడెంట్ అయ్యాక కూడా వాడికి బాలేదు అని డొనేషన్స్ కలెక్ట్ చేసారు కానీ ఈ పిల్ల గురించి ఎవరు పట్టించేకోలేదని మరికొందరు వ్యాఖ్యానించారు. మరి ఈ టిక్ టాక్ స్టార్ మృతి చెందడం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.