టిక్ టాక్ చేస్తూ అడ‌విలో త‌ప్పిపోయింది రాత్రి ఏంచేసిందంటే

125

ఈమధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘‘ టిక్ టాక్’’. సినిమాల్లోని పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా ఒకటేంటి అన్నింటినీ ఈ యాప్ ద్వారా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. గతంలో వచ్చిన డబ్ స్మాష్ లాగానే ఇది కూడా ఉంటుంది. కాకపోతే.. ఇది మరింత పాపులరిటీ సంపాదించుకుంది. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. ఈ యాప్ ను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు.

Image result for tiktok

అశ్లీల చిత్రాలు, మత పరమైన విధ్వంసాలు, హింసను ప్రేరేపించేలా కొందరు టిక్ టాక్ లో వీడియోలను తయారు చేస్తున్నారు. దీంతో.. దీనిపై నిషేధం ప్రకటించాలని తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వం కోరింది..అశ్లీల చిత్రాలు, పలు వర్గాలు, మతాల మధ్య హింసను ప్రేరేపించే సంభాషణలు అధికంగా ఉన్నాయన్నారు.

Image result for tiktok video in forest

ఒక రిపోర్టు ప్రకారం.. ఈ టిక్ టాక్ వీడియోలు చేసేందుకు యువత ఎన్ని ప్రయోగాలు అయినా చేయడానికి రెడీ ఉంటున్నారని తెలుస్తోంది. ఇటీవల ఓ యువకుడు అమ్మాయి డ్రస్ వేసుకొని టిక్ టాక్ లో వీడియో చేసేందుకు ట్రయిన్ ముందు నుంచి దూకేశాడు. ఈయాప్ వినియోగిస్తోందని నాయనమ్మ తిట్టిందని..ముంబయిలో ఓ యువతి అయితే.. ఆత్మహత్య కూడా చేసుకుంది, భార్య ఈ పిచ్చివీడియోలు మాన‌డం లేద‌ని ఆమెని క‌త్తితో న‌రికాడు.. ఇలా ఎన్నో దారుణాలు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా జ‌రిగిన దారుణ‌మైన ఘ‌ట‌న అంద‌ర్ని క‌ల‌వ‌రానికి గురిచేసింది అని చెప్పాలి.

Image result for tiktok video girls in forest

తాజాగా ఓ డిగ్రీ స్టూడెంట్ టిక్ టాక్ చేసేందుకు ఏకంగా అడవుల్లోకి వెళ్లిపోయింది. వెళ్లిన అమ్మాయి తిరిగి రాలేక… ఆ అడ‌విలోనే దారి తప్పినానా అవస్థలు పడింది. కలకడ మండలానికి చెందిన అమ్మాయి తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది.

Image result for tiktok video girls in forest

టిక్‌టాక్‌పై ఉన్న మోజుతో టిక్‌టాక్‌ వీడియో చేసేందుకు అడవిలోకి వెళ్లింది. టిక్ టాక్ చేశాక అడవి నుంచి ఎలా బయటకు రావాలో ఆమెకి అర్థం కాలేదు. దారితప్పి నానా ఇబ్బందులు పడింది. చివరకు తన వాట్సాప్‌ ద్వారా స్నేహితులకు లొకేషన్‌ షేర్ చేసింది. అలా అతడి ఆచూకీ తెలుసుకున్న స్నేహితులు.. పోలీసుల సాయంతో రాత్రి అడవికి వెళ్లారు. రాత్రంతా అక్క‌డే బిక్కు బిక్కుమంటూ ఉంది … ఉదయానికి అడవి నుంచి బయటకు తీసుకురాగలిగారు పోలీసులు. మొత్తానికి 24 గంట‌ల త‌ర్వాత ఆ విధ్యార్దిని బ‌య‌ట‌కు రావ‌డంతో గ్రామంలో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ లోగా అడవిలో ఏక్రూర మృగం ఎటు నుంచి వస్తుందన్న భయంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురయింది. అడవిలోనే ఫిట్స్‌ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కాలంలో టిక్‌టాక్‌ పిచ్చితో చాలామంది యువత ప్రాణాలు పోగుట్టుకున్నారు. మరికొందరు ఉద్యోగులు ఆఫీసుల్లోనే టిక్ టాక్ వీడియోలు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ ప‌డుతుందో ఏమిటో.