ప్రణయ్ అమృత కేసులో మరో ట్విస్ట్ : అమృత తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్!

927

కొన్ని రోజుల కిందట మిర్యాలగూడ ప్రణయ్ హత్య రెండు తెలుగు రాష్టాలలో స్పృష్టించిన కలకలం అందరికి తెలిసిందే.ఈ కేసులో నిందితులందరు దొరకడంతో కేసు నమోదు చేసుకుని వారిని జైలుకు పంపారు.ఆ తర్వాత ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చెయ్యాలని అమృత ప్రణయ్ కుటుంబ సభ్యులు నానా హంగామా చేశారు.అయితే కోర్ట్ కలగజేసుకుని విగ్రహ ప్రతిష్టను నిలిపేసింది.అయితే ఈ విషయం మీద అమృత ఇంకా పోరాడుతూనే ఉంది.కొందరు సపోర్ట్ చేస్తుంటే కొందరేమో వ్యతిరేకిస్తున్నారు.ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు అమృత తల్లి చేసిన పని హాట్ టాపిక్ అయ్యింది. మరి ఏమైందో తెలుసుకుందామా.

Image result for pranay and amrutha

.ప్రణయ్ హత్య తర్వాత అమృత ప్రణయ్ పేరు దేశం మొత్తం తెలిసేలా చేసింది.కులం పేరుతో అల్లుడిని చంపడం దేశం ఉలిక్కిపడేలా చేసింది.ఆ గొడవ అయినా తర్వాత అమృతను సొంత కూతురిలా చూసుకుంటామని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారు ప్రణయ్ తల్లిదండ్రులు.అలాగే అమృత కూడా ఎప్పటికి ప్రణయ్ జ్ఞాపకాలతో ఉంటానని, ప్రణయ్ హత్యకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తానని అన్న సంగతి అందరికి తెలిసిందే.అలాగే ప్రణయ్ తమ్ముడు ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడే ఉంటా అన్నాడు.అయితే ఇంట్లో వాళ్ళ ప్రోద్భలంతో అతను మళ్ళి ఫారెన్ వెళ్ళిపోయాడు.అన్నకు జరిగిన ఇన్సిడెంట్ వలన తమ్ముడి జీవితం నాశనం కాకూడదని ఇంట్లో వాళ్ళు నచ్చజెప్పి వెళ్లిపోయారు.ఇలా ప్రణయ్ కుటుంబం ఆ విషాదం నుంచి మెల్లగా బయటపడుతుంది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి అమృత కు సంబందించిన మరో వార్త బయటకి వచ్చింది.

మిర్యాలగూడ పట్టణంలోని కార్తిక్‌ టెక్స్‌టైల్స్‌ దుకాణం నిర్వాహకుడు గుండా వినోద్‌కుమార్‌ ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై అనుమానం వచ్చిన ప్రణయ్‌ కుటుంబ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ప్రణయ్‌ భార్య అమృత తల్లితో మాట్లాడినట్లు అతడిసెల్‌లో ఉంది. వారి ప్రోద్బలంతోనే వినోద్‌కుమార్‌ తమ ఇంటికి వస్తున్నాడని గుర్తించి అతడిపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదుచేశారు.మరి అతను దేనికోసం ప్రణయ్ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకున్నాడో విచారణలో తేలుతుంది. అయితే పరిచయం చేసుకోడానికి ముఖ్య కారణం మాత్రం అమృత తల్లే అని తెలుస్తుంది. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. అమృతతో ఈ వ్యక్తి ఎందుకు పరిచయం పెంచుకున్నట్టు అమృత తల్లి ఎందుకు ఇతనిని పంపించి ఉంటుంది. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.